News January 16, 2025
నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి 8 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఇవాళ సింగపూర్ వెళ్లనున్న ఆయన అంతర్జాతీయ సౌకర్యాలతో ఏర్పాటైన స్పోర్ట్స్ యూనివర్సిటీలు, స్టేడియాలను పరిశీలించనున్నారు. పారిశ్రామికవేత్తలతోనూ భేటీ కానున్నారు. ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లి దావోస్లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్లో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలువురితో ఒప్పందాలు చేసుకోనున్నారు.
Similar News
News November 1, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

✦ జూబ్లీహిల్స్ బైపోల్: ఇవాళ రాత్రి బోరబండ, ఎర్రగడ్డలో CM రేవంత్ ప్రచారం
✦ నేడు సా.6 గంటలకు రహమత్ నగర్లో KTR రోడ్ షో
✦ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కొత్తగా 75 PG సీట్లు మంజూరు చేసిన NMC.. 1390కి చేరిన సీట్ల సంఖ్య
✦ భవిత కేంద్రాల్లో పని చేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకూ TET మినహాయింపు కుదరదు: హైకోర్టు
✦ గద్వాల(D) ధర్మవరం BC హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 86 మంది విద్యార్థులకు అస్వస్థత
News November 1, 2025
పంటకు ఎరువులను ఇలా అందిస్తే ఎక్కువ లాభం

అవసరాన్ని బట్టి మాత్రమే యూరియాను పంటకు వేసుకోవాలి. మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల చీడపీడల ఉద్ధృతి ఎక్కువై పంటల దిగుబడి తగ్గుతుంది. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా 3 దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు.
సూక్ష్మపోషకాలను పంటలకు స్ప్రే రూపంలో అందిస్తే మొక్క వేగంగా గ్రహిస్తుంది.
News November 1, 2025
IUCTEలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(IUCTE)10 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్: www.iucte.ac.in


