News January 16, 2025
నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి 8 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఇవాళ సింగపూర్ వెళ్లనున్న ఆయన అంతర్జాతీయ సౌకర్యాలతో ఏర్పాటైన స్పోర్ట్స్ యూనివర్సిటీలు, స్టేడియాలను పరిశీలించనున్నారు. పారిశ్రామికవేత్తలతోనూ భేటీ కానున్నారు. ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలువురితో ఒప్పందాలు చేసుకోనున్నారు.
Similar News
News February 19, 2025
ఓటీటీలోకి వచ్చేసిన కొత్త మూవీ

బాలీవుడ్లో హీరోయిన్ కీర్తి సురేశ్ నటించిన తొలి చిత్రం ‘బేబీజాన్’ ఉచిత స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు రెంట్ పద్ధతితో ఉండగా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. కాగా ఈ మూవీ తమిళ చిత్రం విజయ్ ‘తేరి’కి రీమేక్ కావడం గమనార్హం.
News February 19, 2025
హైఅలర్ట్.. సరిహద్దుల్లో మరోసారి అలజడి

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో కూంబింగ్ చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల పలు ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
News February 19, 2025
చరిత్రలోనే పెద్ద మోసం: మస్క్

అమెరికా సామాజిక భద్రతా విభాగంలో డేటాబేస్ పూర్తిగా తప్పని, ‘చరిత్రలోనే ఇది పెద్ద మోసమని’ మస్క్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100సంవత్సరాల పైబడినవారు 2కోట్లమంది, 200ఏళ్లు దాటిన వారు 2వేలమంది. 369 సంవత్సరాల వ్యక్తి జీవించి ఉన్నట్లు డేటాబేస్ ఉందని తెలిపారు. మరణించిన వారి సమాచారం (SSA)లో నమోదు చేయకపోవడంతో ఈసమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల ప్రకారం 100ఏళ్లు దాటిన వారు 86వేలు ఉన్నట్లు తెలిపారు.