News July 8, 2024
‘స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటుపై సీఎం రేవంత్ ఆదేశాలు
TG: స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. దీనిని గచ్చిబౌలి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ESCIలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం పారిశ్రామిక ప్రముఖులతో CM చర్చలు జరిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగావకాశాలు లభించేలా వర్సిటీలో కోర్సులు ఉండాలని సూచించారు.
Similar News
News October 8, 2024
బఫర్ జోన్‌లో ఉన్నవి కూల్చడం లేదు: భట్టి
TG: మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంలోని నిర్మాణాలనే తొలగిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణ, చెరువుల ఆక్రమణలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో పూర్తిగా 44, పాక్షికంగా 127 చెరువులు కబ్జాకు గురైనట్లు వెల్లడించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50లక్షల కోట్లు అనే వార్తలను ఆయన కొట్టిపారేశారు.
News October 8, 2024
ఇవాళ్టి నుంచి రైతు బజార్లలో రాయితీపై టమాటా, ఉల్లి
AP: సెంచరీ దాటిన టమాటా, ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నేరుగా రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లోని రైతు బజార్లలో కిలో టమాటా రూ.50, ఉల్లి రూ.40-45 చొప్పున విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధార్ కార్డుతో వెళితే కుటుంబానికి కిలో చొప్పున ఇస్తామన్నారు.
News October 8, 2024
పోలవరం సందర్శకుల ఖర్చులకు రూ.23 కోట్లు విడుదల
AP: గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలను పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి ఉచితంగా భోజనాలు పెట్టేవారు. దీనికి సంబంధించి 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. వారు హైకోర్టును ఆశ్రయించగా 12 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీంతో మొత్తం రూ.23.11 కోట్ల నిధుల విడుదలకు జలవనరుల శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.