News June 23, 2024
పోలీస్ శాఖకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: CM రేవంత్ ఆదేశాలతో పోలీసులు HYD ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసినట్లు కాంగ్రెస్ Xలో రాసుకొచ్చింది. ‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు. రోడ్డుపై అల్లర్లు సృష్టించొద్దు. అనుమానాస్పద వ్యక్తులకు వాహనంపై లిఫ్ట్ ఇవ్వొద్దు. దుకాణాలను రా.10.30-11 గంటల్లోపు మూసేయాలి. గంజాయి బ్యాచ్ను వదిలిపెట్టేది లేదు. అర్ధరాత్రి జులాయిగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంటూ ఓ పోస్టర్ను షేర్ చేసింది.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


