News June 23, 2024
పోలీస్ శాఖకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
TG: CM రేవంత్ ఆదేశాలతో పోలీసులు HYD ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసినట్లు కాంగ్రెస్ Xలో రాసుకొచ్చింది. ‘బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దు. రోడ్డుపై అల్లర్లు సృష్టించొద్దు. అనుమానాస్పద వ్యక్తులకు వాహనంపై లిఫ్ట్ ఇవ్వొద్దు. దుకాణాలను రా.10.30-11 గంటల్లోపు మూసేయాలి. గంజాయి బ్యాచ్‌ను వదిలిపెట్టేది లేదు. అర్ధరాత్రి జులాయిగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంటూ ఓ పోస్టర్‌ను షేర్ చేసింది.
Similar News
News November 5, 2024
సామాన్యులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్!
AP: భారీగా పెరిగిన నిత్యావసర ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరలపై సరకులు అందజేసేందుకు సిద్ధమవుతోంది. లీటర్ పామాయిల్ రూ.110, కేజీ కందిపప్పు రూ.67, అరకేజీ చక్కెర 16 రూపాయలకే అందించాలని మంత్రులు నాదెండ్ల, పయ్యావుల, అచ్చెన్నాయుడుతో కూడిన కమిటీ నిర్ణయించింది. రైతు బజార్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2200 రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా సరకులు విక్రయించనుంది.
News November 5, 2024
గ్రాడ్యుయేట్లకు అలర్ట్.. రేపే లాస్ట్ డేట్
TG: కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదు గడువు రేపటితో ముగియనుంది. 2019తో (1.96లక్షలు) పోల్చితే ప్రస్తుతం ఓటరు దరఖాస్తుల సంఖ్య(2.40 లక్షలు) పెరిగింది. అయినా ఇంకా సగం మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈనెల 23న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 30న ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు.
News November 5, 2024
అమెరికాలో అత్యధిక ఓటింగ్ శాతం ఎంతంటే?
1876లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో US చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. ఆ ఎలక్షన్లలో ఏకంగా 81.8 శాతం మంది అమెరికన్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 1792 ఎలక్షన్స్‌లో కేవలం 6.3 శాతం మందే ఓట్లు వేశారు. ఇదే అమెరికా చరిత్రలో అత్యల్ప ఓటింగ్ శాతం. గత ఎన్నికల్లో దాదాపు 66 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి అది పెరుగుతుందని అంచనా.