News September 3, 2024

నేడు మహబూబాబాద్‌లో CM రేవంత్‌ పర్యటన

image

TG: ఈ రోజు సీఎం రేవంత్ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వరద తీవ్రతకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. బాధితుల ఇళ్లను సందర్శించి, పరామర్శించనున్నారు. జిల్లాలో పలు చెరువులు తెగిపోవడంతో పాటు రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో రైళ్ల రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. అటు సీఎం రేవంత్ నిన్న ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

Similar News

News September 21, 2024

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి దసరాకు గ్లింప్స్?

image

హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీనికి ‘ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం మధురైలో జరుగుతున్న ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రభాస్ పాల్గొనడం లేదు. రెండో షెడ్యూల్‌లో జాయిన్ అవుతారని మూవీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం నుంచి దసరాకు ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తారని సమాచారం.

News September 21, 2024

OCT 2 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని డిమాండ్

image

AP: మహాలయ అమావాస్య దృష్ట్యా అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని ఆర్‌జేయూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా 3న కూడా సెలవు ఇస్తే ధార్మిక క్రతువులకు వీలుంటుందని ఒక ప్రకటన విడుదల చేశారు. అటు ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు ప్రకటించింది. అటు ఇటీవల భారీ వర్షాలతో సెలవులు ఇచ్చినందువల్ల ఈ దసరా హాలిడేస్ తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.

News September 21, 2024

లిఫ్ట్‌లకు నో చెప్పి రోజూ మెట్లు ఎక్కితే..

image

కాళ్లకు పనిచెప్పకుండా లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఉపయోగించడం పెరిగింది. అయితే రోజూ మెట్లు ఎక్కడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. తొడ కండరాలు, పొట్ట భాగంలోని కొవ్వు తగ్గుతుందని, చక్కటి శరీరాకృతి వస్తుందని పేర్కొంటున్నారు. వేగంగా కాకుండా నెమ్మదిగా స్టెప్స్ ఎక్కాలంటున్నారు. అయితే హార్ట్ ప్రాబ్లమ్స్, మోకాలు, మడమ, కీళ్ల నొప్పులు ఉన్నవారు మెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.