News September 25, 2024
నామినేటెడ్ నేతలతో సీఎం సమీక్ష

AP: ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో సమీక్ష నిర్వహించారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడిన వారికి అవకాశాలు ఇచ్చామని ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నేతలతో కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలని చెప్పారు.
Similar News
News November 27, 2025
స్మోకింగ్, డ్రింకింగ్ కంటే ఒత్తిడి డేంజర్ అని తెలుసా?

స్మోకింగ్, డ్రింకింగ్ కంటే వేగంగా ఆయువును ఒత్తిడి హరిస్తుందని ఓ ఆర్థోపెడిక్ సర్జన్ తెలిపారు. ‘ఒత్తిడి కేవలం మానసిక సమస్య కాదని చాలామందికి తెలియదు. అది పూర్తి బాడీకి సంబంధించినది. ఒత్తిడికి గురైనప్పుడు శరీరం కార్టిసాల్, అడ్రినలిన్ రిలీజ్ చేస్తుంది. వెన్నునొప్పి, తలనొప్పి, పళ్లు కొరకడం, కండరాలు పట్టేయడం వంటి వాటికీ ఒత్తిడే కారణం’ అని చెప్పారు. 7-8 గంటల నిద్రతోనే ఒత్తిడిని ఎదుర్కోగలమన్నారు.
News November 27, 2025
పీరియడ్స్లో హెవీ బ్లీడింగ్ అవుతోందా?

పీరియడ్స్లో 1-3 రోజులకు మించి హెవీ బ్లీడింగ్ అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఫైబ్రాయిడ్స్, ప్రెగ్నెన్సీ సమస్యలు, పీసీఓఎస్, ఐయూడీ, క్యాన్సర్ దీనికి కారణం కావొచ్చు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీన్ని గుర్తించడానికి రక్త పరీక్ష, పాప్స్మియర్, ఎండోమెట్రియల్ బయాప్సీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సోనోహిస్టరోగ్రామ్, హిస్టరోస్కోపీ, D&C పరీక్షలు చేస్తారు.
News November 27, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


