News September 25, 2024

నామినేటెడ్ నేతలతో సీఎం సమీక్ష

image

AP: ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో సమీక్ష నిర్వహించారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడిన వారికి అవకాశాలు ఇచ్చామని ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నేతలతో కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలని చెప్పారు.

Similar News

News October 9, 2024

హండ్రెడ్ లీగ్‌కు CSK, KKR సై?

image

ఇంగ్లండ్‌లో జరిగే హండ్రెడ్ లీగ్‌‌లో ఓ ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు సీఎస్కే, కేకేఆర్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మాంచెస్టర్ ఒరిజినల్స్ ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు చేసేందుకు ఈ రెండు జట్లు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ లంకషైర్‌ అధీనంలో ఉంది. కాగా హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ ఇప్పటివరకు టైటిల్ కొట్టలేదు. రెండు సార్లు రన్నరప్‌గా నిలిచింది.

News October 9, 2024

రూ.436 చెల్లిస్తే రూ.2,00,000 బీమా

image

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన ద్వారా కేంద్రం టర్మ్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. బ్యాంక్ లేదా పోస్టాఫీసులో రూ.436 ప్రీమియం చెల్లిస్తే ఏటా రూ.2 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తారు. సేవింగ్స్ అకౌంట్ కలిగి 18-50 ఏళ్ల వయసు గల వ్యక్తులు ఈ స్కీంకు అర్హులు. www.jansuraksha.gov.in/లో ఫాం నింపి బ్యాంక్, పోస్టాఫీసులో అందజేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లించాక 55 ఏళ్ల వయసు వరకు జీవిత బీమా కొనసాగించొచ్చు.

News October 9, 2024

టాస్ ఓడిన టీమ్ ఇండియా

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న రెండో టీ20లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్: అభిషేక్, శాంసన్, సూర్య(C), నితీశ్, హార్దిక్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్, మయాంక్.
బంగ్లా: లిట్టన్ దాస్, పర్వేజ్ హొస్సేన్, శాంటో(C), తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ సాకిబ్.