News April 24, 2024
సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సెల్ఫీ

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ సెల్ఫీ దిగారు. సోషల్ మీడియా వింగ్తో విశాఖలో ముఖాముఖి సమావేశం ముగిసిన అనంతరం సెల్ఫీదిగి కార్యకర్తల్లో జోష్ నింపారు. ‘మా సోషల్ మీడియా సూపర్స్టార్స్తో నేను’ అంటూ ఆ ఫొటోను సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Similar News
News January 30, 2026
ఫిబ్రవరి 3న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: వచ్చే నెల 3న క్యాబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో పాటు కీలక ఇష్యూలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 28న మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి క్యాబినెట్ భేటీ నిర్వహిస్తుండడం విశేషం.
News January 30, 2026
7 జిల్లాల్లో 64 లక్షల చొరబాటుదారులు: షా

20 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అస్సాం జనాభాలో సమూల మార్పులు వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 7 జిల్లాల్లోకి దాదాపు 64 లక్షల మంది చొరబడ్డారని ఆరోపించారు. ఈ అక్రమ వలసలను సామాన్యులే ఆపాలని.. అందుకు తుపాకులు పట్టుకొని బార్డర్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి BJPకి ఓటు వేస్తే సరిపోతుందన్నారు. 126 అసెంబ్లీ సీట్లున్న అస్సాంలో మార్చి-ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి.
News January 30, 2026
కొమ్మ కత్తిరింపుల వల్ల కోకో పంటలో లాభమేంటి?

కోకో తోటల్లో రెండేళ్ల వరకు మొక్క సింగిల్ కొమ్మతో పెరిగేలా చూడాలి. పంట నాటిన మూడేళ్ల తర్వాత కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. మే 15 – జులై 15లోపు ప్రధాన కొమ్మలను కత్తిరించాలి. దీని వల్ల SEP,OCT,NOV నెలల్లో పూత బాగా వస్తుంది. నేలను చూసే కొమ్మలను, నేల నుంచి 3 అడుగుల వరకు కొమ్మలు లేకుండా కత్తిరించాలి. పదేళ్లు దాటిన తోటల్లో చెట్లు 7 అడుగులలోపే ఉండేలా చూడాలి. దీని వల్ల కాయ పెరుగుదల బాగుంటుంది.


