News April 24, 2024
సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సెల్ఫీ

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ సెల్ఫీ దిగారు. సోషల్ మీడియా వింగ్‌తో విశాఖలో ముఖాముఖి సమావేశం ముగిసిన అనంతరం సెల్ఫీదిగి కార్యకర్తల్లో జోష్ నింపారు. ‘మా సోషల్ మీడియా సూపర్‌స్టార్స్‌తో నేను’ అంటూ ఆ ఫొటోను సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Similar News
News April 17, 2026
ప.గో: జీతాలు రాక హోంగార్డుల పరేషాన్!

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు గత 15 రోజులుగా జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 190 మంది హోంగార్డులకు సుమారు రూ.40 లక్షల వేతనాలు చెల్లించాల్సి ఉంది. అంకితభావంతో పనిచేస్తున్న తమపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని, కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జీతాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
News April 17, 2026
ఆయిల్ పామ్ సాగులో ఇవి కీలకం

ఆయిల్ పామ్ సాగుకు నీటి సదుపాయం కీలకం. 2 అంగుళాల బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా రోజూ 2,3 గంటలు.. వేసవిలో 4,5 గంటలు నీరివ్వాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు తప్పక వేయాలి. పంట దిగుబడికి ఫలదీకరణం కీలకం. అందుకే మొక్క నాటిన ఏడాదిన్నర నుంచి మూడేళ్ల వరకు వచ్చే పొత్తులను తీసేయాలి. దీని వల్ల మొక్క మాను బాగా వృద్ధిచెందుతుంది. భవిష్యత్తులో గెలలు నిండుగా వచ్చి బరువు పెరుగుతాయి.
News April 17, 2026
యుద్ధం.. ఏవియేషన్‌కు ₹18,000 కోట్ల నష్టం!

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ భారత విమానయాన రంగానికి గట్టిగా తగులుతోంది. సుమారు ₹18,000 కోట్ల మేర భారీ నష్టాన్ని చవిచూడబోతోందని PHDCCI నివేదిక అంచనా వేసింది. విమాన మార్గాల మళ్లింపుతో జర్నీ టైమ్ 4 గంటల వరకు పెరగడమే కాకుండా, ఇంధన ఖర్చులు తడిసి మోపెడవడం అందుకు కారణం. మరోవైపు భారత్‌కు వచ్చే విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా 20% వరకు పడిపోయే ప్రమాదం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.


