News September 22, 2024

ట్రాఫిక్‌లో చిక్కుకున్న CM.. ఇద్దరు అధికారులు సస్పెండ్!

image

UP CM యోగి Sept 10న నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అప్పటికే కురిసిన వర్షం వల్ల రోడ్లను వరదలు ముంచెత్తడంతో ట్రాఫిక్ జామైంది. అప్పుడే ఇండియా ఎక్స్‌పో మార్ట్‌ నుంచి తిరిగి గౌతమ్‌బుద్ధ వర్సిటీకి వెళుతున్న CM యోగి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్‌కు ట్రాఫిక్ కారణం కాదని చెప్పడం గమనార్హం.

Similar News

News November 24, 2025

మహిళల కోసం ఎన్నో పథకాలు: రేవంత్

image

TG: ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని CM రేవంత్ కొడంగల్ సభలో తెలిపారు. ‘సన్నబియ్యం ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. సోలార్ ప్లాంట్స్ నిర్వహణ అప్పగించాం. శిల్పారామంలో ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశాం’ అని వివరించారు.

News November 24, 2025

UCIL 107 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<>UCIL<<>>)107 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి టెన్త్, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ కాంపిటెన్సీ, మైనింగ్ మేట్, ఫోర్‌మెన్ సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://ucil.gov.in/

News November 24, 2025

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రూ.304 కోట్లు జమ

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో ఈ నగదు జమ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో డీఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.