News September 22, 2024
ట్రాఫిక్‌లో చిక్కుకున్న CM.. ఇద్దరు అధికారులు సస్పెండ్!
UP CM యోగి Sept 10న నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అప్పటికే కురిసిన వర్షం వల్ల రోడ్లను వరదలు ముంచెత్తడంతో ట్రాఫిక్ జామైంది. అప్పుడే ఇండియా ఎక్స్‌పో మార్ట్ నుంచి తిరిగి గౌతమ్‌బుద్ధ వర్సిటీకి వెళుతున్న CM యోగి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సహా ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేశారు. వారి సస్పెన్షన్‌కు ట్రాఫిక్ కారణం కాదని చెప్పడం గమనార్హం.
Similar News
News October 12, 2024
అత్యాచార ఘటన.. సీఎం కీలక ఆదేశాలు
AP: శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడలిపై జరిగిన అత్యాచార <<14338493>>ఘటనపై <<>>సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. అటు నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
News October 12, 2024
ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ITBPలో 545 కానిస్టేబుల్(డ్రైవర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు నవంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10% ఖాళీలను ఎక్స్-సర్వీస్‌మెన్‌కు కేటాయించారు. టెన్త్ పాసైన 21 నుంచి 27 ఏళ్లు వారు దరఖాస్తుకు అర్హులు. హెవీ వాహనాలు నడిపే లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎంపికైన వారికి ₹21,700-69,100 పేస్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు. ఫీజు ₹100. మరిన్ని వివరాలకు ఇక్కడ <
News October 12, 2024
లుంగీలు, దుప్పట్ల సాయంతో జైలు నుంచి జంప్!
అస్సాంలోని మోరిగావ్ జిల్లా జైలు నుంచి శుక్రవారం రాత్రి ఐదుగురు ఖైదీలు పరారయ్యారు. లుంగీలు, దుప్పట్లను తాడులా చేసి 20 అడుగుల జైలు గోడను దూకేశారు. ఖైదీలు సైఫుద్దీన్, జియారుల్ ఇస్లాం, నూర్ ఇస్లాం, మఫీదుల్, అబ్దుల్ రషీద్ పోక్సో కేసుల్లో నేరస్థులని, వారి కోసం జిల్లావ్యాప్తంగా జల్లెడ పడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఖైదీలకు ఎవరైనా సాయం చేశారా అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.