News April 10, 2025

ఇవాళ YIPSను ప్రారంభించనున్న సీఎం

image

TG: HYD శివారు మంచిరేవులలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌(YIPS)ను సీఎం రేవంత్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఇందులో పోలీసులు, అమరవీరులు, హోంగార్డుల పిల్లలకు 50 శాతం, సాధారణ పౌరుల పిల్లలకు 50 శాతం సీట్లు కేటాయిస్తారు. ప్రస్తుతం 200 సీట్లు ఉండగా, భవిష్యత్తులో 5వేలకు పెంచుతారు. అలాగే 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో 1,750 పడకలతో హాస్టల్‌ను నిర్మిస్తారు.

Similar News

News April 23, 2025

టెన్త్‌లో RECORD: 600కు 600 మార్కులు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని యల్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించింది. పదో తరగతిలో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. దీంతో నేహాంజనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
*Congratulations Nehanjani Yalla

News April 23, 2025

టెస్లాకే టైం కేటాయిస్తా: మస్క్

image

మే నెల నుంచి టెస్లా వ్యవహారాలకే అధిక సమయం కేటాయిస్తానని మస్క్ ప్రకటించారు. DOGE కోసం ఎక్కువ సమయం పనిచేయనని తెలిపారు. టెస్లా త్రైమాసిక లాభాలు 71శాతం మేర క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. DOGEకు అధినేతగా వ్యహరిస్తున్న మస్క్ నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించారు. దీంతో మస్క్‌పై వ్యతిరేకత అధికమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News April 23, 2025

ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్ ఫలితాలు విడుదల

image

AP: ఓపెన్ స్కూల్ టెన్త్‌, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓపెన్ SSC పరీక్షలకు 26,679 మంది హాజరవగా 10,119 మంది పాసయ్యారు. ఇంటర్‌లో 63,668 విద్యార్థులకు గాను 33,819 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ కోసం ఈనెల 26 నుంచి మే 5 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు ₹200, రీవెరిఫికేషన్‌కు ₹1000 చెల్లించాలి. https://apopenschool.ap.gov.in/ సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు

error: Content is protected !!