News January 31, 2025

రేపు అన్నమయ్య జిల్లాలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సంబేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సంబేపల్లి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేయనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News February 9, 2025

ఇంగ్లండ్ చెత్త రికార్డు

image

వన్డేల్లో ఇంగ్లండ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. 300కు పైగా స్కోర్ చేసి అత్యధిక సార్లు పరాజయం పాలైన జట్టుగా నిలిచింది. 99 మ్యాచుల్లో 28 సార్లు ఇంగ్లండ్ ఓడింది. ఆ తర్వాతి స్థానాల్లో భారత్(27), వెస్టిండీస్(23), శ్రీలంక(19) ఉన్నాయి. వన్డే WC 2023 తర్వాత ఇంగ్లండ్‌కు ఇది వరుసగా నాలుగో సిరీస్ ఓటమి.

News February 9, 2025

మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? అయితే రిస్క్‌లో పడ్డట్లే…

image

మీ పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్లు ఇస్తున్నారా.. అయితే వారికి మీరు కీడు చేసినట్లే. చిన్నపిల్లల్లో 6నెలల నుంచి మాటలు రావటం ప్రారంభమవుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూనే వారు మాట్లాడటం నేర్చుకుంటారు. ఈ వయసులో ఫోన్లు ఇవ్వటం ద్వారా వాటినే చూస్తుంటారు. తద్వారా మూడేళ్ల దాకా మాటలు రాకపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆటిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.

News February 9, 2025

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

image

AP: తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఇందులో ఏఆర్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు. వీరిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సీబీఐ జేసీ వీరేశ్ ప్రభు తిరుపతిలోనే ఉండి విచారణను వేగవంతం చేశారు.

error: Content is protected !!