News December 10, 2024
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం ట్వీట్
TG: డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘4 కోట్ల ప్రజల మనోఫలకాలపై నిండైన రూపంగా నిన్నటి వరకు నిలిచిన తెలంగాణ తల్లి నేడు సచివాలయ నడిబొడ్డున నిజమైన రూపంగా అవతరించిన శుభ సందర్భం. ఇది తల్లి రుణం తీసుకున్న తరుణం’ అని Xలో రాసుకొచ్చారు.
Similar News
News January 26, 2025
నా తండ్రి జీవించి ఉంటే బాగుండేది: అజిత్
పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నట్లు తమిళ హీరో అజిత్ తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ రోజు నా తండ్రి జీవించే ఉంటే బాగుండేది. ఆయన నన్ను చూసి గర్వపడేవారు. నా తల్లి ప్రేమకు, త్యాగాలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నాకు ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదని, అనేక మంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నా’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
News January 26, 2025
ప్రముఖ డైరెక్టర్ గుండెపోటుతో మృతి
మలయాళ డైరెక్టర్ షఫీ(56) కన్నుమూశారు. ఈనెల 16న గుండెపోటుకు గురైన ఆయన కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. కామెడీ చిత్రాలతో పాపులర్ అయిన షఫీ సుమారు 50కి పైగా సినిమాలను డైరెక్ట్ చేశారు. ‘వన్ మ్యాన్ షో’ ఆయన తొలిచిత్రం. కళ్యాణరామన్, పులివల్ కళ్యాణం, తొమ్మనమ్ మక్కలుమ్, టూ కంట్రీస్, చిల్డ్రన్ పార్క్, షెర్‌లాక్ టోమ్స్ తదితర మూవీలు తీశారు. 2022లో వచ్చిన ఆనందం పరమానందం షఫీ చివరి మూవీ.
News January 26, 2025
30 ఏళ్ల పోరాటానికి దక్కిన గుర్తింపు
1965లో ఉమ్మడి వరంగల్(D) న్యూశాయంపేటలో జన్మించిన మందకృష్ణ మాదిగ విద్యార్థి దశలోనే కులవివక్షపై పోరాడారు. కొంతకాలం పీపుల్స్‌వార్‌లో పనిచేశారు. తర్వాత బయటికొచ్చి దళిత ఉద్యమకారుడిగా మారారు. SC వర్గీకరణ కోసం 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా గతేడాది SC వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈక్రమంలోనే నిన్న ఆయనకు కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది.