News March 8, 2025

ఉచితాలపై చర్చ జరగాలన్న సీఎం.. మీరేమంటారు?

image

TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందంటూనే <<15677567>>ఉచిత పథకాల<<>>పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉచితాలు పంచడం తన ఒక్కడి సమస్యే కాదని, ఢిల్లీలోనూ బీజేపీ ఉచితాలు ప్రకటించిందని వెల్లడించారు. ఈ ఉచిత పథకాల కారణంగా మౌలిక సదుపాయాలపై రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News March 26, 2025

ఈ మార్పులు కనిపిస్తే కళ్లజోడు మార్చాల్సిందే!

image

ఒకటే కళ్లజోడును ఎక్కువ రోజులు వాడొద్దని, ఏడాది లేదా రెండేళ్లకోసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సంకేతాలేమైనా కనిపిస్తే కళ్లద్దాలను మార్చుకోవాలని చెబుతున్నారు.
1. డ్రైవింగ్‌లో సిగ్నల్స్ కనిపించకపోవడం, దగ్గరకు వెళ్లేవరకూ చదవలేకపోవడం 2. పుస్తకాలు చదవడం, మొబైల్‌ చూడటం కష్టంగా అనిపించడం 3. ఒకటి లేదా రెండు కళ్లల్లోని దృష్టిలో మార్పు కనబడటం వంటివి కనిపించినప్పుడు అద్దాలు మార్చాలి.

News March 26, 2025

ప్రజల కోసమే భూభారతి: పొంగులేటి

image

TG: ధరణి ఓ దుర్మార్గ చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. అందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ‘ధరణి ఎజెండాతోనే మేం ఎన్నికలకు వెళ్లాం. ధరణి బాగుందా లేదా అని ఎన్నికల్లో ప్రజల తీర్పుతోనే స్పష్టమైంది. బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టే ఓడించారు. భవిష్యత్‌లోనూ భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తాం. ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి మద్దతిస్తారో చూద్దాం’ అంటూ సవాల్ విసిరారు.

News March 26, 2025

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇప్పటికే కొన్ని పేపర్ల వాల్యుయేషన్ ప్రారంభమైంది. అన్ని పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెల 29న ఎప్‌సెట్ ఉండటంతో దానికి 2, 3 రోజులు ముందుగానే రిజల్ట్స్ రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే.

error: Content is protected !!