News April 7, 2026
CMC & MMC: సిటీకి గ్లోబల్ ‘గేర్’!

HYD రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని CMC, MMCలు సమూలంగా మార్చేస్తున్నాయి. వెస్ట్ జోన్‌లోని CMC ఇప్పుడు ‘స్కై స్క్రాపర్’ హబ్‌గా అవతరించింది. 25 అంతస్తుల పైబడిన భవనాలకు నేరుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పవర్ ఉంది. MMC లాజిస్టిక్ పవర్‌హౌస్‌గా ఎదుగుతోంది. ఈ రెండు సెల్ఫ్ గవర్నింగ్ బాడీలు. ఇక్కడ వసూలయ్యే ప్రతి రూపాయి కోర్ సిటీకి వెళ్లకుండా ఈ శాటిలైట్ నగరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడానికే ఖర్చు చేస్తారట.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.