News January 3, 2025
CMR బాత్ రూం వీడియోల కేసు.. కాలేజీకి 3 రోజులు సెలవులు
TG: మేడ్చల్ జిల్లా కండ్లకోయ CMR కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్ రూంలో విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అదుపులోకి తీసుకున్న ఏడుగురిని అక్కడ లభించిన వేలిముద్రల ఆధారంగా విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న 12 ఫోన్లలో డేటానూ కాప్స్ చెక్ చేస్తున్నారు. అటు దర్యాప్తునకు ఇబ్బంది లేకుండా 3 రోజుల పాటు CMR కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది.
Similar News
News January 14, 2025
ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, కేసీఆర్, బాలయ్య
సంక్రాంతి వేళ ఏపీ సీఎం చంద్రబాబు, BRS అధినేత కేసీఆర్, బాలకృష్ణలతో కూడిన ఫ్లెక్సీ వైరల్ అవుతోంది. చంద్రబాబు కింద బాస్ ఈజ్ బ్యాక్, బాలయ్య కింద డాకు మహారాజ్, కేసీఆర్ కింద బాస్ ఈజ్ కమింగ్ సూన్ అని రాశారు. ఆ ఫ్లెక్సీలో లోకేశ్, కేటీఆర్, జూనియర్ ఎన్టీఆర్, మోక్షజ్ఞ కూడా ఉన్నారు. ఖమ్మం జిల్లాలోని ముగ్గు వెంకటాపురంలో ఈ బ్యానర్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎవరు దీన్ని పెట్టారో క్లారిటీ రావాల్సి ఉంది.
News January 14, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్
సంక్రాంతి కానుకగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజా పోస్టర్‌లో మూవీ టీమ్ రిలీజ్ డేట్‌ను వెల్లడించలేదు. ‘మనం ఎప్పుడు వస్తే అప్పుడే అసలైన పండుగ.. త్వరలో చితక్కొట్టేద్దాం’ అని పేర్కొంది.
News January 14, 2025
లాస్ ఏంజెలిస్: మళ్లీ మంటలు.. హెచ్చరికలు
లాస్ ఏంజెలిస్ (అమెరికా)కు మరో ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. లాస్ ఏంజెలిస్ తూర్పు ప్రాంతంలోని శాంటా అనా నది పక్కన కొత్తగా మంటలు ప్రారంభమయ్యాయని, భీకర గాలులతో ఇవి వేగంగా విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. జురుపా అవెన్యూ, క్రెస్ట్ అవెన్యూ, బురెన్ ప్రజలు తక్షణం తమ నివాస ప్రాంతాలను వదిలి వెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు గాలులతో మంటలు ఆర్పడం ఫైర్ ఫైటర్లకు కష్టంగా మారింది.