News June 22, 2024

వైసీపీ దేవుడి స్క్రిప్ట్ వ్యాఖ్యలకు సీఎం కౌంటర్

image

AP: వైనాట్ 175 అన్న వైసీపీ 11 సీట్లకు పరిమితమైందని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘2019లో మాకు 23 సీట్లు వస్తే దేవుడి స్క్రిప్ట్ అంటూ హేళన చేశారు. ఇప్పుడు మాకొచ్చిన 164 సీట్లు కలిపితే 11 వస్తుంది. 1631 రోజులు అమరావతి రైతులు ఉద్యమం చేశారు. ఆ అంకెలు కలిపితే 11 వస్తుంది. ఇది దేవుడి స్క్రిప్ట్ అని అనడం లేదు. ఓడిన వాళ్లను హేళన చేయాల్సిన అవసరం లేదు. YCP వాళ్లు సభలో ఉంటే అర్థమయ్యేది’ అని చెప్పుకొచ్చారు.

Similar News

News January 20, 2025

ఇండియా కూటమిలో చేరాలని విజయ్‌కి ఆఫర్

image

విభజన శక్తులతో పోరాడేందుకు ఇండియా కూటమిలో చేరాలని తమిళగ వెట్రి కజగం చీఫ్, సినీ నటుడు విజయ్‌ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సెల్వపెరుంతగై కోరారు. ఇటీవల ఓ సభలో దేశంలో విభజన శక్తులు ఉన్నాయని విజయ్ అన్నారు. అలాంటి శక్తులను నిర్మూలించి, దేశానికి ప్రయోజనం చేకూర్చేందుకు తమతో చేరాలని కాంగ్రెస్ చీఫ్ సూచించారు. అయితే రాహుల్‌పై విజయ్ కొంత నమ్మకం ఉంచాలని TN బీజేపీ చీఫ్ అన్నామలై వ్యంగ్యస్త్రాలు సంధించారు.

News January 20, 2025

ఇలాంటి అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు: ఈటల

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BJP ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్థిక శాఖలో లంచం లేకుండా పనిచేయడం లేదని విమర్శించారు. ఇళ్ల దగ్గరే నేతలు కమిషన్లు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అత్యంత అసమర్థ, అవినీతి, సమన్వయం లేని ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు, మూసీ పక్కన ఇళ్లు కూల్చే ప్రయత్నం చేసి ఇప్పుడు జవహర్ నగర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు.

News January 20, 2025

అథ్లెట్‌పై లైంగిక వేధింపులు.. 57 మంది అరెస్టు

image

కేరళలో అథ్లెట్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు 57 మందిని అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు మినహా అందరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 30 FIRలు నమోదు చేసినట్లు తెలిపారు. ఐదు సార్లు యువతిపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు విచారణలో తేలింది. తనకు 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచీ ఇరుగు పొరుగు వ్యక్తులు, కోచ్‌లు, తోటి అథ్లెట్లు లైంగికంగా వేధించారని ఆమె ఫిర్యాదు చేశారు.