News January 20, 2025
ఇలాంటి అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు: ఈటల

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BJP ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్థిక శాఖలో లంచం లేకుండా పనిచేయడం లేదని విమర్శించారు. ఇళ్ల దగ్గరే నేతలు కమిషన్లు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అత్యంత అసమర్థ, అవినీతి, సమన్వయం లేని ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు, మూసీ పక్కన ఇళ్లు కూల్చే ప్రయత్నం చేసి ఇప్పుడు జవహర్ నగర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు.
Similar News
News February 14, 2025
టెన్త్ అర్హతతో 1,154 పోస్టులు.. నేడే లాస్ట్

ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,154 పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, సివిల్ ఇంజినీర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, ఏసీ మెకానిక్ పోస్టులను భర్తీ చేయనుంది. రూ.100 ఫీజు చెల్లించి www.rrcecr.gov.in సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. NCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి. అభ్యర్థుల వయసు 24 ఏళ్లలోపు ఉండాలి.
News February 14, 2025
ఏపీలో జీబీఎస్ కేసులు.. ప్రభుత్వం అలర్ట్

APలో జీబీఎస్ (గిలియన్ బారే సిండ్రోమ్) వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్‌లోనే ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆస్పత్రిని సందర్శించారు. జీబీఎస్ బాధితులు ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్నారు. ఈ వైరస్‌కు పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు.
News February 14, 2025
తులసిబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను సీఐడీ అరెస్టు చేసినప్పుడు తులసిబాబు తన గుండెలపై కూర్చొని దాడి చేశాడని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.