News August 27, 2024

రుషికొండ భవనాలపై త్వరలో సీఎం నిర్ణయం: మంత్రి నారాయణ

image

AP: ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణలో దుర్వాసన ఉండదని, అదే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో డంపింగ్ యార్డును పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడారు. వచ్చే నెల నాటికి TDR కుంభకోణాలపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలను ఏం చేయాలనే దానిపై సీఎం చంద్రబాబు త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Similar News

News April 11, 2026

ఎల్లుండి రాష్ట్రపతితో మంత్రి లోకేశ్ భేటీ

image

AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలపనున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్న ఆయన సోమవారం కూటమి ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు. అమరావతి ప్రాశస్త్యం, రాజధాని పనుల్లో పురోగతి తదితరాల గురించి తెలిపే బుక్‌ను ఈ సందర్భంగా రాష్ట్రపతికి అందజేయనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన అమరావతి బిల్లుపై గెజిట్ నోటిఫికేషన్ రిలీజైన విషయం తెలిసిందే.

News April 11, 2026

KGBV దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

image

AP: రాష్ట్రంలోని 352 KGBVల్లో చేరేందుకు దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు SPD శ్రీనివాసరావు తెలిపారు. నిన్నటితో గడువు ముగియగా పేరెంట్స్ వినతి మేరకు ఈనెల 20వ తేదీ వరకు పొడిగించామన్నారు. 6, 11 తరగతుల్లో ప్రవేశాలతో పాటు మిగతా తరగతుల్లో మిగిలిపోయిన అడ్మిషన్లకు అప్లికేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 32,079 సీట్లకు గానూ నిన్నటి వరకు 69,362 దరఖాస్తులు వచ్చాయని ఆయన వెల్లడించారు.

News April 11, 2026

ఏపీలో 6 జోన్లు.. లిస్ట్ ఇదే

image

AP: ఉద్యోగాల కల్పనకు సంబంధించి రాష్ట్రంలోని 4 జోన్లను క్యాబినెట్ 6 జోన్లుగా మార్చింది. రెండు మల్టీ జోన్లను మూడుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Z1: SKLM, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
Z2: అల్లూరి, తూ.గో, కాకినాడ, కోనసీమ
Z3: ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
Z4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు
Z5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప
Z6: నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి