News December 31, 2024
లిక్కర్ షాపులపై CM కీలక నిర్ణయం

AP: మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్‌ను పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 10.5 శాతం మార్జిన్ వల్ల నష్టపోతున్నామని, పెంచాలని షాపుల యజమానులు ప్రభుత్వాన్ని కోరడంతో 14 శాతానికి పెంచాలని చంద్రబాబు నిర్ణయించారు. మరోవైపు రూ.99కి మద్యం అన్ని చోట్లా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల లిక్కర్, నకిలీ మద్యం రాకుండా చూడాలన్నారు.
Similar News
News November 13, 2025
భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు వెండి ధర ఇవాళ కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.9వేలు పెరిగి రూ.1,82,000కు చేరింది.
News November 13, 2025
నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర: నిఘా వర్గాలు

‘ఢిల్లీ పేలుడు’పై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి 4 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. ప్రతి గ్రూప్ భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని, పేలుళ్ల కోసం 20 క్వింటాళ్లకు పైగా ఎరువులను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఉమర్‌కు రూ.20 లక్షల డబ్బు అందిందని నిఘా వర్గాలు గుర్తించాయి.
News November 13, 2025
NIT వరంగల్ 45పోస్టులకు నోటిఫికేషన్

<


