News December 24, 2024

పెన్షన్లపై సీఎం కీలక ఆదేశాలు

image

APలో పెన్షన్లు తీసుకునే వారిలో పలువురు అనర్హులు ఉన్నారని CM చంద్రబాబు తెలిపారు. అర్హులకే పథకాలు, పెన్షన్లు ఇవ్వాలనేది తమ ఉద్దేశమని, ఇదే సమయంలో అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం సరికాదన్నారు. అనర్హులను తొలగించేందుకు 3 నెలల్లోగా దివ్యాంగుల పెన్షన్లపై తనిఖీలు పూర్తి చేయాలన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లు, అధికారులపై చర్యలు తప్పవన్నారు. అటు అర్హులైన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

Similar News

News December 23, 2025

రేపటి నుంచి సెలవులు

image

తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు రేపటి నుంచి 3 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణలో 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే సందర్భంగా జనరల్ హాలిడేస్ ప్రకటించారు. అటు ఏపీలో 24, 26న ఆప్షనల్, 25న జనరల్ హాలిడేస్ ఇచ్చారు. జనరల్ హాలిడే రోజు అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. ఆప్షనల్ హాలిడేకు కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటిస్తాయి.

News December 23, 2025

కాసేపట్లో కౌంట్‌డౌన్ స్టార్ట్

image

AP: రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న బ్లూబర్డ్ బ్లాక్-2 శాటిలైట్ కౌంట్‌డౌన్ ఇవాళ 8.54amకు ప్రారంభం కానుంది. శ్రీహరికోటలోని షార్ 2వ ప్రయోగ వేదిక నుంచి రేపు 8.54amకు LVM3-M6 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రయోగం మొదలైన 15.07నిమిషాల్లో నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెడతారు. మిషన్ సక్సెస్ కావాలని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ నిన్న సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ గుడి, తిరుమలలో పూజలు నిర్వహించారు.

News December 23, 2025

నేడు పంచముఖ హనుమంతుడిని పూజిస్తే..?

image

మంగళవారం నాడు పంచముఖ హనుమంతుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. జాతకంలోని కుజ దోష నివారణకు, రుణ బాధల నుంచి విముక్తి కోసం ఈ పూజ చేయాలంటున్నారు. ‘5 ముఖాల స్వామిని ఆరాధించడం వల్ల 5 దిశల నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాధుల నుంచి విముక్తి, శత్రువులపై విజయం సాధిస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానం లభిస్తాయి’ అంటున్నారు.