News February 6, 2025

‘తల్లికి వందనం’పై సీఎం కీలక ప్రకటన

image

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం)పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News October 14, 2025

ఈ మాస్క్‌తో అవాంఛిత రోమాలకు చెక్

image

చాలామంది అమ్మాయిలను వేధించే సమస్య అవాంఛిత రోమాలు. అయితే ఈ ప్యాక్‌తో వాటిని ఇంట్లోనే తొలగించుకోవచ్చు. చెంచా జెలటిన్ పొడిలో చల్లార్చిన పాలు, తేనె, చిటికెడు పసుపు కలపాలి. ముఖాన్ని శుభ్రం చేసుకొని వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌తో అద్దుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మాస్క్ తీసేసి ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని రుద్దుకోవాలి. ఇలా చేస్తే క్రమంగా అవాంఛితరోమాలు దూరమవుతాయి.

News October 14, 2025

బాహుబలిని బీట్ చేసిన కాంతార ఛాప్టర్-1

image

కాంతార ఛాప్టర్-1 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్‌గా రూ.675Cr వసూలు చేసి బాహుబలి-ది బిగినింగ్(రూ.650Cr)ను బీట్ చేసింది. ఇదేక్రమంలో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’(రూ.628Cr) రికార్డు కూడా బద్దలైంది. దీంతో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-20 చిత్రాల్లో 17వ స్థానానికి ఎగబాకింది. అటు 2025లో హయ్యెస్ట్ గ్రాస్ పొందిన సినిమాల్లో రెండో ప్లేస్‌ దక్కించుకుంది. ఫస్ట్ ప్లేస్‌లో ఛావ(రూ.808Cr) ఉంది.

News October 14, 2025

BREAKING: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

image

ప్రతిష్ఠాత్మక టెక్ కంపెనీ గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలపై అగ్రిమెంట్ కుదిరింది. CM చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.88,628 కోట్లతో ఒక గిగావాట్ కెపాసిటీతో 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తికి గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.