News February 6, 2025
‘తల్లికి వందనం’పై సీఎం కీలక ప్రకటన

AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ (స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు చొప్పున సాయం)పథకాన్ని అమలు చేయాలని క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏప్రిల్‌లో మత్స్యకార భరోసా అమలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవ విధివిధానాలపై చర్చించాలని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యత మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News January 13, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

MSDలా రాహుల్ ఫినిషర్ పాత్ర: ఆకాశ్ చోప్రా

భారత ప్లేయర్ రాహుల్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఆధునిక క్రికెట్‌లో MS ధోనీలా ఫినిషర్ పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. NZతో తొలి వన్డేలో హర్షిత్ క్రీజులో ఉన్నప్పుడు నెమ్మదిగా ఆడుతూ సుందర్ వచ్చాక గేర్ మార్చారన్నారు. ధోనీ వలే ప్రశాంతంగా ఉంటూ సింగిల్స్ తీస్తూ అవసరమైప్పుడు భారీ షాట్లు ఆడారన్నారు. బౌలింగ్ కాకుండా ఏ రోల్ పోషించేందుకైనా రాహుల్ సిద్ధంగా ఉంటారని చెప్పారు.