News January 20, 2025
నేటి నుంచి WEF.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

ప్రపంచ ఆర్థిక సదస్సు(WEF) నేటి నుంచి దావోస్‌లో ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు వెళ్లారు. మూడు రోజులపాటు CBN బృందం, నాలుగు రోజుల పాటు రేవంత్ బృందం సమావేశంలో పాల్గొననుంది. భారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై ఇరురాష్ట్రాల సీఎంలు దృష్టిపెట్టారు. ఈ సదస్సులో భారత్ సహా పలు దేశాలకు చెందిన 2,800 మంది నేతలు పాల్గొంటారు.
Similar News
News February 19, 2025
మోనాలిసాకు బిగ్ షాక్?

కుంభమేళాలో వైరలయిన మోనాలిసా ‘ది డైరీ ఆఫ్ మణిపుర్’ మూవీలో నటించనున్నారు. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే నిలిచిపోయేలా కనిపిస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాగుబోతని సినీ నిర్మాత జితేంద్ర ఆరోపించారు. ‘సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడు. అతని ఒక్క సినిమా విడుదల కాలేదు. మోనాలిసాను వాడుకుంటున్నాడు’ అని జితేంద్ర పేర్కొన్నారు. దీనిని మిశ్రా ఖండించారు.
News February 19, 2025
తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు విపత్తు, వరదల సాయం కింద నిధులు విడుదల చేసింది. ఏపీకి అత్యధికంగా రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231 కోట్లు, త్రిపురకు రూ.288.93 కోట్లు, ఒడిశాకు రూ.255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ.170.99 కోట్లు రిలీజ్ చేసింది. ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల చేశారు.
News February 19, 2025
సలామ్ DIIs: 45 రోజుల్లోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి

స్వదేశీ సంస్థాగత మదుపరులు (DII) భారత స్టాక్ మార్కెట్లకు ఆపద్బాంధవులుగా మారారు. FM నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగానే రిటైల్ ఇన్వెస్టర్లతో కలిసి FIIల పెట్టుబడుల ఉపసంహరణను పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటున్నారు. 2025లో 45 రోజుల్లోనే రూ.1.2లక్షల కోట్లను ఈక్విటీల్లో కుమ్మరించారు. FIIలు వెనక్కి తీసుకున్న రూ.1.6 లక్షల కోట్లతో ఇది దాదాపుగా సమానం. 2024లోనూ DIIలు రూ.5.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం విశేషం.