News January 16, 2025

ఎల్లుండి 2 జిల్లాల్లో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం గుంటూరులో <<15157199>>వాట్సాప్ గవర్నెన్స్ సేవలను<<>>, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లాలో నిర్వహించే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని ఉండవల్లికి తిరిగెళ్తారు. సాయంత్రం తన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా‌కు డిన్నర్ ఇవ్వనున్నారు. సీఎం 19న దావోస్ పర్యటనకు బయలుదేరుతారు.

Similar News

News February 18, 2025

విజయ్‌తో డేటింగ్ రూమర్స్.. రష్మిక పోస్ట్ వైరల్

image

విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రోజ్ ఫ్లవర్ బొకేను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఆమె ‘నా ముఖంపై చిరునవ్వు ఎలా తెప్పించాలో నీకు బాగా తెలుసు పాపలు❤️’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆ బొకే VDనే పంపించి ఉంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల విజయ్ ‘కింగ్‌డమ్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ సమయంలో రష్మిక అతడిని <<15440673>>పొగుడుతూ<<>> ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

News February 18, 2025

సీఈసీ నియామకం.. కేంద్రంపై కాంగ్రెస్ మండిపాటు

image

చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) ప్రకటన కేంద్రం తొందరపాటు నిర్ణయమని కాంగ్రెస్ మండిపడింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కలిగి ఉండాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు పునరుద్ఘాటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే సీఈసీ నియామకాన్ని చేపట్టడం అత్యున్నత ధర్మాసనాన్ని అవమానించడమే’ అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు.

News February 18, 2025

బంపర్ ఆఫర్ ఇంకా ఉంది: మస్క్

image

గతంలో వికీపీడియా పేరు మార్పుపై ప్రకటించిన ఆఫర్ ఇప్పటికీ ఉందని మస్క్ ట్వీట్ చేశారు. గతంలో ఆసంస్థ పేరును అసభ్యకరంగా మార్చుకుంటే 1బిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తానని మస్క్ ప్రకటించారు. అయితే ఒక యూజర్ ఈ ఆఫర్ ఇంకా ఉందా అని అడగగా ‘అవును పేరు మార్చుకుంటే ఉంటుంది’ అని మస్క్ బదులిచ్చారు.

error: Content is protected !!