News October 1, 2024

నేడు కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహించనున్న గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లను పంపిణీ చేస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కర్నూలు జిల్లాకు ఆయన రావడం ఇదే తొలిసారి.

Similar News

News October 1, 2024

20న పోలవరం ప్రాజెక్టు వద్ద వర్క్‌షాప్

image

AP: పోలవరంలో కీలకమైన డిజైన్లు, నిర్మాణ పనులపై ఈ నెల 20న కేంద్ర జల సంఘం ప్రాజెక్టు వద్ద వర్క్‌షాప్ నిర్వహించనుంది. డయాఫ్రంవాల్, ఎగువ కాఫర్ డ్యామ్‌లో సీపేజీకి అడ్డుకట్ట వేయడం తదితర అంశాలపై అంతర్జాతీయ నిపుణులు, ఉన్నతాధికారులు చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి 2025 జులై వరకు చేయాల్సిన పనుల షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు.

News October 1, 2024

పత్తి క్వింటాల్ రూ.7,521.. నేటి నుంచి కొనుగోళ్లు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లను CCI ప్రారంభించనుంది. మొత్తంగా 33 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసింది. క్వింటాల్‌కు రూ.7,521 మద్దతు ధరను చెల్లించనుంది. కొనుగోలు చేసిన 7 రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బు జమవుతుంది. పత్తి విక్రయం కోసం అన్నదాతలు దగ్గర్లోని రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్లిచ్చిన నమోదుపత్రంతో పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాలి.

News October 1, 2024

IIScలో రిజర్వేషన్ కటాఫ్‌పై నెట్టింట చర్చ

image

ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)లో అడ్మిషన్ కోసం రాసే JAM రిజర్వేషన్ కటాఫ్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. జనరల్ కేటగిరీ విద్యార్థికి 76వ ర్యాంకు వచ్చినా సీటు రాదని, ST కేటగిరీలో 4వేల ర్యాంకు వచ్చినా అడ్మిషన్ వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఏ ర్యాంకు విద్యార్థి మెరుగైన పరిశోధన చేస్తారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. పరిశోధన రంగంలోనైనా మెరిట్ చూడాలంటున్నారు.