News October 1, 2024

నేడు కర్నూలు జిల్లాలో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పత్తికొండ మండలంలోని పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహించనున్న గ్రామ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్లను పంపిణీ చేస్తారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కర్నూలు జిల్లాకు ఆయన రావడం ఇదే తొలిసారి.

Similar News

News October 15, 2024

హైకోర్టు జడ్జిలుగా ముగ్గురు లాయర్ల పేర్లు సిఫారసు

image

AP: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు లాయర్ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. వారిలో కుంచం మహేశ్వరరావు, టి.చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్ ఉన్నారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపిన తర్వాత ఉత్తర్వులు వెలువడనున్నాయి.

News October 15, 2024

కోహ్లీ.. మరో 53 పరుగులు చేస్తే

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువయ్యారు. రేపటి నుంచి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులో మరో 53 పరుగులు చేస్తే 9వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు. దీంతో భారత జట్టు తరఫున టెస్టుల్లో 9వేల పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా నిలవనున్నారు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకు 115 టెస్టులు ఆడిన కోహ్లీ 8,947 పరుగులు చేశారు.

News October 15, 2024

KTRపై కేసు నమోదు

image

TG: మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. మూసీ ప్రాజెక్టును రూ.1.5 లక్షల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందని, అందులో రూ.25,000 కోట్లు ఢిల్లీకి పంపుతుందని ఆయన ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదుతో BNS 352, 353(2), 356(2) చట్టాల కింద KTRపై పోలీసులు కేసు నమోదు చేశారు.