News October 4, 2024

హార్దిక్ బౌలింగ్‌పై కోచ్ మోర్కెల్ అసంతృప్తి!

image

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ కోసం ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తిరిగి భారత జట్టులో చేరనున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేసిన తీరుపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి డెలివరీ తర్వాత హార్దిక్ దగ్గరికి వెళ్లి సలహాలు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అక్టోబర్ 6న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

Similar News

News January 26, 2026

ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ అప్డేట్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. RFCలో జరిగిన చిత్రీకరణలో నైట్ ఎఫెక్ట్ సీన్లు తీసినట్లు సినిమాటోగ్రఫీ విభాగంలో పనిచేస్తోన్న ప్రజ్వల్ ఇన్‌స్టాలో వెల్లడించారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీలో యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉంటాయని సినీవర్గాలు చెబుతున్నాయి. NTR కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమాగా ‘డ్రాగన్’ ఉండనున్నట్లు సమాచారం.

News January 26, 2026

భారత్‌కు కెనడా ప్రధాని! సంబంధాలు గాడిన పడినట్లేనా?

image

కెనడా PM మార్క్ కార్నీ మార్చిలో భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. యురేనియం, ఎనర్జీ, మినరల్స్, AI వంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉందని భారత్‌లోని ఆ దేశ హై కమిషనర్ దినేశ్ పట్నాయక్ వెల్లడించారు. USతో కెనడాకు ఈ మధ్య చెడింది. మరోవైపు కెనడా మాజీ PM ట్రూడో అధికారంలో ఉండగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో కార్నీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

News January 26, 2026

అలాంటి రేప్ కేసులు చెల్లవు: హైకోర్టు

image

వెస్ట్రన్ కల్చర్ ప్రభావంతో యువతలో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌ ధోరణి పెరిగిందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. బ్రేకప్ తర్వాత మహిళల అత్యాచార ఆరోపణలతో పురుషులపై FIRలు నమోదవుతున్నాయని పేర్కొంది. కిడ్నాప్, రేప్ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి దిగువకోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. బాధితురాలు ఇష్టపూర్వకంగా అతడితో వెళ్లినందున ఆరోపణలు చెల్లవని, పైగా ఆ సమయంలో ఆమె మేజర్ అని స్పష్టం చేసింది.