News May 25, 2024
అభిషేక్ శర్మకు శిక్షణ ఇచ్చింది WC2011 హీరో: రైనా

క్వాలిఫయర్-2లో RRపై SRH గెలుపులో కీలకంగా ఆడిన అభిషేక్ శర్మ గురించి సురేశ్ రైనా ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ‘అభిషేక్ శర్మకు ఎవరు శిక్షణ ఇస్తున్నారో తెలుసా? 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్. యువీ భారత్‌కు రైజింగ్ స్టార్‌ను అందించాడు’ అని తెలిపారు. ఈ మ్యాచులో బ్యాట్‌తో కేవలం 12 రన్సే చేసినా..RR విధ్వంసక బ్యాటర్లు సంజూ, హెట్ మెయర్‌లను ఔట్ చేసి సత్తాచాటారు. SRH ప్రతి గెలుపులోనూ ఆయన పాత్ర ఉంది.
Similar News
News February 10, 2025
రంగరాజన్‌పై దాడి దురదృష్టకరం: పవన్

చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడిని AP Dy.CM పవన్ ఖండించారు. ఇది దురదృష్టకరమని, ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని చెప్పారు. దాడి వెనుక కారణాలేంటో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తనకు రంగరాజన్ అనేక సూచనలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన్ను పరామర్శించాలని TG జనసేన నేతలకు పవన్ సూచించారు.
News February 10, 2025
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వినియోగం

TG: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. 16 వేల మెగావాట్లకు చేరువలో డిమాండ్ ఉంది. ఈ నెల 7న అత్యధికంగా 15,920 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. యాసంగి పంటలు, వేసవి ప్రభావంతో డిమాండ్ పెరిగింది. మరోవైపు, విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే.
News February 10, 2025
5 కిలోమీటర్లకు 5 గంటల సమయం

కుంభమేళాకు వెళ్లిన ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 300 కి.మీ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. 5 కి.మీ 5 గంటల సమయం పట్టిందని ఓ ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి ట్రాఫిక్ ఉండటంతో చాలామంది ఇంకా UPలోకే ఎంటర్ కాలేదు. ఇక త్రివేణీ సంగమానికి చేరుకోవడం గగనంలా మారింది. గంటలకొద్దీ వాహనాల్లోనే కూర్చోవడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.