News June 20, 2024
కూటమి విజయం అందరిదీ: పురందీశ్వరి

AP: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం అందరి విజయమని రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. ‘ఒకప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్షం లేని రాష్ట్రంగా చెప్పుకుంటున్నాం. మూడు పార్టీల జెండాలు, ఎజెండాలు వేరైనా కలిసికట్టుగా పనిచేశాం. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పును ఇచ్చారు. కూటమిని ఆదరించారు’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

AP: శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్‌తో పాటు పని అనుభవం గలవారు JAN 27 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18- 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBDలకు రూ.500. వెబ్సైట్: srikakulam.dcourts.gov.in/
News January 18, 2026
రాజకీయం ఇప్పుడే మొదలైంది: శివసేన(UBT)

ముంబై మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ‘రిసార్ట్ రాజకీయం’ మొదలైన తరుణంలో శివసేన (UBT) కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. అసలైన రాజకీయం ఇప్పుడే మొదలవుతుంది’ అని సామ్నా ఎడిటోరియల్‌లో పేర్కొంది. ముంబైకి ఇప్పటివరకు 23 మంది మరాఠీ మేయర్లను అందించిన సంప్రదాయం కొనసాగుతుందా అని ప్రశ్నించింది. మేయర్ ఎంపిక విషయంలో CM ఫడణవీస్, Dy.CM షిండే మధ్య అంతర్గత పోరు నడుస్తోందని రాసుకొచ్చింది.
News January 18, 2026
T20 WC టీమ్‌లో ప్లేస్ మిస్.. స్పందించిన సిరాజ్

T20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంపై భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి మౌనం వీడారు. ‘నేను గత T20 ప్రపంచకప్‌లో ఆడాను. ఈసారి ఆడటం లేదు. ఒక ప్లేయర్‌కు ప్రపంచకప్‌లో ఆడటం అనేది ఒక కల. దేశం కోసం ఆడటం గొప్ప విషయం. ప్రస్తుతం ఎంపికైన జట్టు బాగుంది. మంచి ఫామ్‌లో ఉంది. వారికి నా విషెస్. ట్రోఫీ గెలవాలి’ అని అన్నారు. సౌతాఫ్రికాతో సిరీస్‌లోనూ లేకపోవడంపై వర్క్‌లోడ్ మ్యానేజ్మెంటే కారణమని వివరించారు.


