News June 20, 2024

కూటమి విజయం అందరిదీ: పురందీశ్వరి

image

AP: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం అందరి విజయమని రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. ‘ఒకప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్షం లేని రాష్ట్రంగా చెప్పుకుంటున్నాం. మూడు పార్టీల జెండాలు, ఎజెండాలు వేరైనా కలిసికట్టుగా పనిచేశాం. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పును ఇచ్చారు. కూటమిని ఆదరించారు’ అని ఆమె పేర్కొన్నారు.

Similar News

News September 19, 2024

తరగతి గదిలోకి టీచర్లు ఫోన్ తీసుకెళ్తే కఠిన చర్యలు

image

TG: క్లాస్ రూమ్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లొద్దనే ఆదేశాలున్నా కొందరు టీచర్ల తీరు మారట్లేదు. ఇటీవల కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల్లో పలువురు ఉపాధ్యాయులు సెల్‌ఫోన్‌లోనే సమయం గడుపుతూ కనిపించారు. దీంతో విద్యాశాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తరగతి గదిలోకి ఫోన్ తీసుకెళ్లొద్దని, అత్యవసరమైతే HM అనుమతి తీసుకోవాలని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

News September 19, 2024

కౌలు రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

image

AP: కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూయజమాని సంతకం లేకుండానే వచ్చే రబీ నాటికి కౌలు కార్డులను ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. దీనివల్ల కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా పంట రుణాలు ఇప్పించడం, ప్రభుత్వ సబ్సిడీలు, పరిహారాలు అందించడం మరింత సులువవుతుంది. అదే సమయంలో రైతుల భూమి హక్కులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోనుంది. వారిలో ఉన్న అపోహలు తొలగించనుంది.

News September 19, 2024

జమిలితో ప్రాంతీయ పార్టీలకు దెబ్బేనా?

image

జమిలి ఎన్నికలతో తమకు నష్టం కలుగుతుందని పలు ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశభద్రత, విదేశాంగ విధానం లాంటి జాతీయ అంశాల ఆధారంగా ప్రజలు అసెంబ్లీకీ ఓటు వేసే అవకాశం ఉందంటున్నాయి. స్థానిక సమస్యలు మరుగున పడటంతో పాటు ప్రాంతీయ పార్టీలు నష్టపోయి, జాతీయ పార్టీలకు మేలు కలుగుతుందని చెబుతున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశముందని ఓ సర్వేలో తేలింది.