News November 16, 2024

ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత

image

ఢిల్లీలో మ‌రో భారీ డ్ర‌గ్స్ రాకెట్ వెలుగుచూసింది. వెస్ట్ ఢిల్లీలోని జ‌న‌క్‌పురీ, నంగ్లోయ్‌లో రూ.900 కోట్ల విలువైన 80 KGల కొకైన్‌ను నార్కోటిక్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు త‌ర‌లించ‌డానికి సిద్ధంగా ఉన్న ఈ క‌న్‌సైన్‌మెంట్‌ను సీజ్ చేశారు. ఈ విష‌యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్రువీక‌రిస్తూ డ్ర‌గ్స్ రాకెట్‌పై నిర్దాక్షిణ్యంగా వేట సాగిస్తామ‌ని పేర్కొన్నారు. అధికారులను అభినందించారు.

Similar News

News December 13, 2024

బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ హీరోయిన్

image

ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే తల్లి అయ్యారు. తాను బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. బిడ్డకు పాలిస్తూ ల్యాప్‌టాప్‌తో వర్క్ చేస్తున్న ఫొటోను ఆమె పంచుకున్నారు. 2011లో బ్రిటన్‌కు చెందిన బెనెడిక్ట్ టేలర్‌తో లివింగ్ టుగెదర్ తర్వాత 2012లో ఆమె పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

News December 13, 2024

‘పిల్లిపై ప్రేమ ఒల‌క‌బోస్తున్నాడు’.. భ‌ర్త‌పై భార్య‌ కేసు

image

పిల్లిపై అధిక ప్రేమ చూపిస్తున్నాడంటూ ఓ భ‌ర్త‌పై భార్య IPC 498A కింద గృహ హింస కేసు పెట్టారు. దీనిని క‌ర్ణాట‌క HC జ‌డ్జి జ‌స్టిస్ నాగ‌ప్ర‌స‌న్న విచారించారు. త‌న కంటే పిల్లినే ప్రేమ‌గా చూస్తున్నారని భార్య చేసిన ఆరోప‌ణ‌ల‌కు, కేసు పెట్టిన సెక్ష‌న్ల‌కు సంబంధం లేద‌ని జడ్జి పేర్కొన్నారు. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించ‌డం చ‌ట్టాన్ని దుర్వినియోగం చేయ‌డ‌మే అవుతుంద‌న్నారు. భ‌ర్త‌కు మ‌ధ్యంత‌ర ర‌క్షణ క‌ల్పించారు.

News December 13, 2024

పాకిస్థాన్‌తో బంధాల‌పై జైశంక‌ర్ కామెంట్‌

image

ఇత‌ర దేశాల మాదిరి పాక్‌తో కూడా మంచి సత్సంబంధాల‌నే కోరుకుంటున్నామ‌ని విదేశాంగ మంత్రి జైశంక‌ర్ తెలిపారు. అయితే, మిగ‌తా దేశాల్లాగే అది కూడా తీవ్రవాదరహితమై ఉండాలన్నారు. ఇది భారత ప్రభుత్వ విధానమ‌ని పేర్కొన్నారు. గ‌త ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకుంటున్న‌ట్టు పాక్ నిరూపించుకోవాలని స్ప‌ష్టం చేశామ‌ని, లేదంటే ద్వైపాక్షిక‌ బంధాల్లో తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించామ‌న్నారు. ఆ బాధ్యత పాక్ చేతుల్లోనే ఉందన్నారు.