News November 14, 2024
ప్రపంచంలోని అత్యంత శీతల నగరాలివే

1. యాకుత్స్క్, రష్యా (-41 F/ -40 C)
2. నోరిల్స్క్, రష్యా (-22 F/-30 C)
3. ఎల్లోనైఫ్, కెనడా (-18.2 F/-27.9 C)
4. బారో, యునైటెడ్ స్టేట్స్ (-13 F/-25 C)
5. ఉలాన్‌బాతర్, మంగోలియా (-11.2 F/-24.6 C)
6. ఇంటర్నేషనల్ ఫాల్స్, US (4.4 F/-15 C)
7. అస్తానా, కజకిస్థాన్ (6.4 F/ -14.2 C)
Similar News
News April 14, 2026
ఐపీఎల్: SRHలోకి కొత్త ప్లేయర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి మరో ఫాస్ట్ బౌలర్ వచ్చారు. గాయంతో టోర్నీకి దూరమైన బ్రైడన్ కార్స్(ENG) స్థానంలో శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను తీసుకున్నట్లు ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించింది. రూ.75లక్షల ప్రైస్‌తో ఆయన్ను తీసుకుంది. మధుశంక గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడారు. SL తరఫున ఒక టెస్ట్, 28 వన్డేలు, 19 టీ20ల్లో మొత్తం 70 వికెట్లు పడగొట్టారు.
News April 14, 2026
పిల్లులు సగం ఆహారమే ఎందుకు తింటాయి?

సాధారణంగా పెంపుడు పిల్లులు పెట్టిన ఆహారంలో సగమే తిని మిగతాది వదిలేస్తుంటాయి. ఇందుకు కారణం ఆ ఆహారం తాలూకు వాసన వాటికి బోర్ కొట్టడమేనని పరిశోధనల్లో తేలింది. ఎంత మంచి ఆహారం అయినా సరే రోజూ అదే పెడితే పిల్లులు క్రమంగా దాన్ని తినడం తగ్గించేస్తాయట. వేర్వేరు రకాల ఆహారం పెడుతూ ఉంటే అవి తినేందుకు ఆసక్తి చూపిస్తాయని.. ఆకలి కంటే కూడా వాసనకే ప్రాధాన్యం ఇస్తాయని రీసెర్చ్ పేర్కొంది.
News April 14, 2026
సీట్లు పెంచకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేయండి: CM

TG: లోక్‌సభ సీట్ల పెంపుపై అభ్యంతరం తెలుపుతూ సీఎం రేవంత్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని సూచించారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని తెలిపారు. లోక్‌సభ సీట్లు పెంచకుండా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే సపోర్ట్ చేస్తామన్నారు.


