News August 19, 2024
బెంగాల్లో ప్రజాస్వామ్యం పతనం: గవర్నర్

బెంగాల్లో ప్రజాస్వామ్యం పతనమవుతోందని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. మహిళలకు అండగా ఉంటానని రక్షాబంధన్ సందర్భంగా రాజ్భవన్లో తనను కలిసిన మహిళా వైద్యులు, నేతలకు అభయమిచ్చారు. ‘మన కూతుళ్లు, అక్కచెల్లెళ్లను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలి. వారు సంతోషంగా, భద్రంగా ఉండే సమాజాన్ని నిర్మించాలి. ఇది మన కనీస ధర్మం. మనది సుదూర లక్ష్యమని తెలుసు. మీ వెంట నేనున్నా. మనం దాన్ని కచ్చితంగా చేరగలం’ అని ఆయన అన్నారు.
Similar News
News December 8, 2025
ఈ హాస్పిటల్లో అన్నీ ఉచితమే..!

AP: వైద్యం కాస్ట్లీ అయిపోయిన ఈరోజుల్లో ఉచితంగా ప్రపంచస్థాయి వైద్యం అందిస్తోంది కూచిపూడిలోని(కృష్ణా) రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రి. 200 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ నుంచి శస్త్రచికిత్సల వరకు అన్నీ ఉచితమే. దాదాపు 70 గ్రామాల ప్రజలకు ఈ ఆసుపత్రి సేవలందిస్తోంది. పేదల సంజీవనిగా పేరొందిన ఈ హాస్పిటల్ను సందర్శించిన బీజేపీ నేత యామిని శర్మ ట్వీట్ చేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది.
News December 8, 2025
సరసమైన ధరలున్నా.. BSNLవైపు మళ్లట్లేదు!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇటీవల రూ.485 ప్లాన్(72 రోజులు డైలీ 2GB డేటా) తీసుకొచ్చింది. ఇలాంటి ఎన్నో ప్లాన్స్ ఉన్నా యూజర్లు BSNLవైపు మళ్లట్లేదని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ప్రైవేట్ సంస్థలు 5G సేవలు అందిస్తుండగా BSNL ఇంకా 4Gకే పరిమితమైంది. డేటా స్పీడ్ తగ్గడం, కాల్ డ్రాప్స్, నెట్వర్క్ కవరేజ్ సమస్యల వల్లే ప్రైవేట్ సంస్థల వైపు వెళ్తున్నారు’ అని అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News December 8, 2025
మూవీ ముచ్చట్లు

✦ ఈ నెల 12నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కాంత’
✦ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు.. ‘బెంగళూరు మహానగరంలో బాలక’ సినిమాతో హీరోగా ఎంట్రీ.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్
✦ ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానున్న అగస్త్య నరేశ్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘గుర్రం పాపిరెడ్డి’


