News August 19, 2024

బెంగాల్లో ప్రజాస్వామ్యం పతనం: గవర్నర్

image

బెంగాల్లో ప్రజాస్వామ్యం పతనమవుతోందని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. మహిళలకు అండగా ఉంటానని రక్షాబంధన్ సందర్భంగా రాజ్‌భవన్లో తనను కలిసిన మహిళా వైద్యులు, నేతలకు అభయమిచ్చారు. ‘మన కూతుళ్లు, అక్కచెల్లెళ్లను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలి. వారు సంతోషంగా, భద్రంగా ఉండే సమాజాన్ని నిర్మించాలి. ఇది మన కనీస ధర్మం. మనది సుదూర లక్ష్యమని తెలుసు. మీ వెంట నేనున్నా. మనం దాన్ని కచ్చితంగా చేరగలం’ అని ఆయన అన్నారు.

Similar News

News September 18, 2024

వారికి రూ.3వేల నిరుద్యోగ భృతి!

image

AP: రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల 17న మెమో పంపినట్లు సమాచారం. అయితే ఆ మెమోలో ఈ నెల 16లోపు పంపాలని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

News September 18, 2024

ఆకట్టుకుంటున్న ‘దేవర’ కొత్త పోస్టర్లు

image

‘దేవర’ మూవీ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా మూవీ టీమ్ రిపీటెడ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూవీ టీమ్ కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది. మరోవైపు నిన్న చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రేపు చండీగఢ్‌కు, ఈనెల 23న అమెరికా వెళ్తారని సమాచారం. ఈలోగా 22న HYDలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుంది.

News September 18, 2024

రైల్లో ఫుడ్ డెలివరీ.. మరిన్ని స్టేషన్లలో ‘జొమాటో’ సేవలు

image

రైలు ప్రయాణికులకు ZOMATO తన సేవలను విస్తరించింది. ట్రైన్‌లో ఉండగా ఫుడ్ ఆర్డర్ చేస్తే సీట్ల వద్దకే డెలివరీ చేస్తోంది. 2023లో 5 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 స్టేషన్లలో అందిస్తోంది. ఇప్పటివరకు 10లక్షల ఆర్డర్లు డెలివరీ చేసింది. వెయిటింగ్ ప్యాసింజర్లకూ ఈ సేవలను అందిస్తోంది. ప్రయాణికులు తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేయవచ్చు.