News June 29, 2024
రాజ్‌కోట్ ఎయిర్‌పోర్టులో ధ్వంసమైన పైకప్పు
ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలి ఓ క్యాబ్ డ్రైవర్ మృతిచెందిన దుర్ఘటన మరువక ముందే అదే తరహా ఘటన మరోటి వెలుగుచూసింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో భారీ వర్షాల కారణంగా ఎయిర్‌పోర్టు వెలుపల ఉన్న పైకప్పు ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోనూ విమానాశ్రయం పైకప్పు భారీ వర్షాలకు ధ్వంసమైంది.
Similar News
News October 11, 2024
మందు బాబులపై ‘రౌండాఫ్’ భారం
AP: నూతన లిక్కర్ పాలసీలో రౌండాఫ్ పేరుతో ఛార్జీల వసూలుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ విధానంపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఉదాహరణకు మద్యం బాటిల్ ధర ₹150, ₹200 ఉంటే యథాతథంగా ఉంచుతారు. ఆ రేటుకు అర్ధరూపాయి ఎక్కువున్నా రౌండాఫ్ చేసి ₹160, ₹210 వసూలు చేస్తారు. ఒకవేళ సీసా ధర ₹90.5 ఉంటే రౌండాఫ్ ₹99 చేస్తారు. రూ.99కే నాణ్యమైన క్వార్టర్ మద్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 11, 2024
భారతీయులకు రాష్ట్రపతి దుర్గా పూజ శుభాకాంక్షలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దుర్గా పూజ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చెడుపై మంచి సాధించిన విజయానికి దుర్గా పూజ ప్రతీక. అమ్మవారిని శక్తికి సంకేతంగా భావిస్తాం. ఐక్యతను, సర్వమత సమానత్వాన్ని చాటేందుకు ఈ పండుగ ఓ సందర్భం. మనందరికీ దుర్గమ్మ శక్తి, ధైర్యం, సంకల్పాన్ని ఇవ్వాలని కోరుకుందాం. మహిళల్ని అత్యున్నతంగా గౌరవించుకుందాం’ అని పిలుపునిచ్చారు.
News October 11, 2024
ఢిల్లీ వెళ్లనున్న ఉత్తమ్
TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా NDSA ఛైర్మన్ అనిల్ జైన్‌తో భేటీ కానున్న ఆయన కాళేశ్వరం బ్యారేజీలపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఛైర్మన్‌తోనూ సమావేశం కానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలపై వారితో చర్చించడంతో పాటు నీటి నిల్వకు ఉన్న అవకాశాలపై సమీక్షిస్తారు.