News September 15, 2024
ప్రతి నెలా ఆస్తి పన్ను వసూలు?
TG: రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలలకోసారి ప్రభుత్వం ఆస్తి పన్ను విధిస్తుండగా, ప్రజలు ఏడాదికోసారి చెల్లిస్తున్నారు. వారిపై ఆర్థిక భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు, నల్లా బిల్లుల మాదిరిగానే ప్రాపర్టీ ట్యాక్స్‌ను కూడా ప్రతి నెలా వసూలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రెగ్యులర్‌గా పన్ను, రుసుములు చెల్లించేవారికి బహుమతులు లేదా ఓ నెల రాయితీ ఇవ్వాలనుకుంటోంది. సీఎం రేవంత్ ఆదేశాలతో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Similar News
News October 15, 2024
రేపు క్యాబినెట్ భేటీ.. కీలక పథకానికి ఆమోదం?
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మహిళలకు ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు, వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 పోస్టుల భర్తీపై చర్చించనున్నట్లు సమాచారం. పారిశ్రామిక రంగంపై 5-6 నూతన పాలసీలు క్యాబినెట్ ముందుకు వస్తాయని తెలుస్తోంది.
News October 15, 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘దీపావళి’ కానుక?
దీపావళి సమీపిస్తున్న వేళ దేశంలోని కోటికిపైగా కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనున్నట్లు సమాచారం. త్వరలో జరిగే క్యాబినెట్ భేటీలో వారి డీఏను 3 శాతం పెంచుతుందని తెలుస్తోంది. దీంతో వారి డీఏ 50 నుంచి 53 శాతానికి చేరనుంది. అలాగే జులై, ఆగస్టు, సెప్టెంబర్ అరియర్స్ కూడా అందుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది కూడా పండుగల సీజన్‌లోనే 3 శాతం డీఏను ప్రభుత్వం పెంచింది.
News October 15, 2024
కొవిడ్ సోకిన పిల్లలకు డయాబెటిస్ ముప్పు అధికం: పరిశోధకులు
కొవిడ్ సోకిన పిల్లలు, యువతలో డయాబెటిస్ వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉందని USలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో తేలింది. 2020 జనవరి-2022 డిసెంబరు మధ్యకాలంలోని వైద్య రికార్డులను వారు పరిశీలించారు. కొవిడ్ సోకిన పిల్లలకు, సాధారణ శ్వాసకోశ సమస్యలున్న పిల్లలకు మధ్య టైప్-2 డయాబెటిస్ వ్యత్యాసాన్ని గమనించగా.. కరోనా సోకిన వారిలో తర్వాతి 6 నెలల్లోనే డయాబెటిస్ వచ్చినట్లు గుర్తించారు.