News November 27, 2024
వచ్చే నెల 3, 4 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

AP: డిసెంబర్ 3, 4 తేదీల్లో వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ కాన్ఫరెన్స్‌లో విజన్-2047, వివిధ సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లతో సీఎం చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పనుల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News October 26, 2025
ప్రెగ్నెన్సీలో పానీపూరి తింటున్నారా?

పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే ప్రెగ్నెన్సీలో సమతుల ఆహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలామంది క్రేవింగ్స్ పేరుతో ఫాస్ట్ఫుడ్స్, స్వీట్స్ వంటివి అతిగా తీసుకుంటారు. ముఖ్యంగా పానీపూరి, ఫాస్ట్‌ఫుడ్, బిర్యానీ వంటివి అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. వీటిని తింటే విరేచనాలు, వాంతులు, డీహైడ్రేషన్ సమస్యలొస్తాయంటున్నారు. వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన ఆహారమే తినాలని సూచిస్తున్నారు.
News October 26, 2025
విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. తప్పిన ప్రమాదం

సౌదీ అరేబియాకు చెందిన SV340(Boeing 777-300) విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. జెడ్డా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా పక్షుల గుంపు ఢీకొట్టింది. అక్కడ పక్షుల రక్తపు మరకలు అంటుకున్నాయి. ముందరి భాగం దెబ్బతింది. ల్యాండింగ్ సేఫ్టీనే అని పైలట్ నిర్ధారించుకుని ల్యాండ్ చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు గుర్తించారు. పక్షులు ఇంజిన్లోకి వెళ్లి ఉంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది.
News October 26, 2025
‘కాలానమక్’ వరి రకం ప్రత్యేకతలు ఇవే..

కాలానమక్ దేశీ వరి రకం పంట కాలం 130 నుంచి 140 రోజులు. 3 నుంచి 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ బియ్యంలో ఉండే అధిక ప్రొటీన్లు, ఐరన్, జింక్, ఇతర సూక్ష్మపోషకాలు మన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ బియ్యానికి 2013లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. ఔషద గుణాలు కలిగిన ఈ బియ్యం తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచవచ్చంటున్నారు నిపుణులు.


