News November 27, 2024
వచ్చే నెల 3, 4 తేదీల్లో కలెక్టర్ల సదస్సు
AP: డిసెంబర్ 3, 4 తేదీల్లో వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈ కాన్ఫరెన్స్‌లో విజన్-2047, వివిధ సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్లతో సీఎం చర్చిస్తారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పనుల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 13, 2024
రేపు కీలక ప్రకటన: మంచు విష్ణు
మంచు మోహన్ బాబు ఇంట్లో వివాదం నేపథ్యంలో మంచు విష్ణు ఆసక్తికర ట్వీట్ చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు తాను ఓ ప్రకటన విడుదల చేస్తానని వెల్లడించారు. తాను చేసే ప్రకటన మనసుకు చాలా దగ్గరగా ఉంటుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో విష్ణు ఎలాంటి విషయం వెల్లడించబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
News December 13, 2024
అల్లు అర్జున్ విడుదల ఆలస్యం
చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల కాస్త ఆలస్యం కానుంది. న్యాయమూర్తి ఆదేశాల కాపీ సైట్‌లో అప్‌లోడ్ అయిన తర్వాత వాటిని జైలర్ వెరిఫై చేసుకుని ఖైదీలను రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం తీర్పు కాపీ ప్రిపరేషన్‌లో ఉందని సమాచారం. దీంతో బన్నీ బయటకు వచ్చేందుకు మరో అరగంటకు పైగా సమయం పట్టవచ్చని తెలుస్తోంది. కాగా బన్నీకి స్వాగతం పలికేందుకు జైలు బయట భారీగా ఫ్యాన్స్, ఇంటి వద్ద కుటుంబీకులు వేచి చూస్తున్నారు.
News December 13, 2024
ఈ రోజు మార్కెట్ల జోష్‌కు కారణం ఇదే!
స్టాక్ మార్కెట్లు Fri ఉదయం నుంచి నష్టాల్లో పయనించినా మిడ్ సెషన్‌లో కొనుగోళ్ల మద్దతుతో తిరిగి పుంజుకున్నాయి. దీనికి ప్రధానంగా FIIల పెట్టుబడుల ప్రవాహం కారణంగా కనిపిస్తోంది. DIIలు ₹732 కోట్ల విలువైన షేర్లు అమ్మేశారు. అయితే, FII/FPIలు ₹2,335 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు. దీంతో కీలక రంగాలకు లభించిన కొనుగోళ్ల మద్దతు సూచీల రివర్సల్‌కి కారణమైందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.