News August 1, 2024

5న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. ఈ అంశాలపై సీఎం ఫోకస్

image

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి CM చంద్రబాబు కలెక్టర్ల‌ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీన జరిగే మీటింగ్‌కు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతి భద్రతలు, గంజాయి నిర్మూలనపై సమావేశంలో CM ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములు, ఇసుక, సహజ వనరుల దోపిడీ జరిగినట్లు గుర్తించామని చెబుతున్న సీఎం.. ఈ అంశాలపై ఫోకస్ పెడతారని తెలుస్తోంది.

Similar News

News February 2, 2025

కులగణన సర్వే వివరాలు

image

TG: * సర్వేలో పాల్గొన్న జనాభా: 3.54 కోట్లు(96.9 శాతం)
* ఎస్సీల జనాభా: 17.43 శాతం
* ఎస్టీల జనాభా: 10.45 శాతం
* బీసీల జనాభా: 46.25 శాతం
* ముస్లిం మైనారిటీ బీసీలు: 10.08 శాతం
* ముస్లింల మైనారిటీ బీసీలతో కలిపి మొత్తం బీసీలు: 56.33 శాతం
* ముస్లిం మైనారిటీ ఓసీలు: 2.48 శాతం
* ముస్లిం మైనారిటీలు: 12.56 శాతం
* ఓసీల జనాభా: 15.79 శాతం
* సర్వేలో పాల్గొనని జనాభా- 3.1 శాతం

News February 2, 2025

ఈ నెల 4న కులగణనపై క్యాబినెట్ భేటీ

image

TG: రాష్ట్రంలో బీసీల సామాజిక న్యాయానికి అడుగుపడిందని క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో కులగణన సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. ఇలాంటి సర్వే దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. ఈ నెల 4న నివేదికపై క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామన్నారు. అదే రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలోనూ డిస్కస్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

News February 2, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంత ప్రత్యేకమేమీ కాదు: గంభీర్

image

ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో పాక్‌తో తాము ఆడే మ్యాచ్ ప్రత్యేకమేమీ కాదని భారత కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. ‘23న పాక్‌తో మ్యాచ్ ఉంది అని పనిగట్టుకుని గుర్తుపెట్టుకుని టోర్నీలో అడుగుపెట్టం. లీగ్ దశలో 5 మ్యాచులున్నాయి. అన్నీ మాకు కీలకమే. పాక్‌తో మ్యాచ్ కూడా వాటిలాగే. దాని ప్రత్యేకతేమీ లేదు. ప్రేక్షకులకు భావోద్వేగాలుంటాయి’ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.