News October 17, 2024
రేపటి నుంచి కాలేజీలు బంద్
TG: ఫార్మసీ కాలేజీల్లో రేపటి నుంచి క్లాసులు బంద్ చేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఇప్పటికే డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ను చేపడుతుండగా, రేపటి నుంచి ఫార్మసీ కాలేజీలు సైతం బంద్‌లో పాల్గొననున్నాయి.
Similar News
News November 13, 2024
మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం
APలో మరో నాలుగు కార్పొరేషన్ల డైరెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రజక, కొప్పుల వెలమ, గవర, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్లలో 15 మంది చొప్పున మొత్తం 60 మంది డైరెక్టర్లను నియమించారు. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ సభ్యుడికి అవకాశం ఇవ్వగా, మిగతా 12 మంది టీడీపీ వాళ్లే. జాబితా కోసం ఇక్కడ <
News November 13, 2024
KTR ఆదేశాలతోనే కలెక్టర్‌పై దాడి!.. రిమాండ్ రిపోర్టులో సంచలనం
TG: కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే లగచర్లలో అధికారులపై దాడి జరిగినట్లు పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ‘ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చాలనే కుట్ర పన్నారు. సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారు. కొందరికి డబ్బులిచ్చి దాడికి ఉసిగొల్పారు. అధికారులను చంపినా పర్వాలేదని నరేందర్ రెడ్డి రైతులకు చెప్పారు’ అని రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు.
News November 13, 2024
WHATSAPP యూజర్లే టార్గెట్‌గా సైబర్ క్రిమినల్స్ కొత్త స్కామ్
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. వేలాదిగా జంటలు పెళ్లిపీటలు ఎక్కనున్నాయి. ఇదే అదనుగా సైబర్ క్రిమినల్స్ పాత APK స్కామ్‌నే మళ్లీ కొత్తగా మొదలుపెట్టారు. తెలియని ఫోన్ నంబర్ నుంచి మీ వాట్సాప్‌కు పెళ్లి ఇన్విటేషన్ పంపిస్తారు. అందులో APK ఫైల్ ఉంచుతారు. దాన్ని తెరవగానే మీ మొబైల్లో సీక్రెట్‌గా ఇన్‌స్టాలై బ్యాంకు, పర్సనల్ డేటాను దొంగిలిస్తుంది. దీని ఆధారంగా క్రిమినల్స్ మీ బ్యాంకులోని డబ్బును దోచుకుంటారు.