News July 3, 2024

రండి.. ఈ అపురూప విజయాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం: రోహిత్

image

ముంబై మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జరిగే విక్టరీ పరేడ్‌కు రావాలని కెప్టెన్ రోహిత్ శర్మ పిలుపునిచ్చారు. దీంతో 2007 T20 WC బస్ పరేడ్‌ను ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. MS ధోనీ సారథ్యంలోని ఇండియన్ టీమ్ 2007లో టీ20 ప్రపంచ కప్ గెలిచి స్వదేశానికి తిరిగివచ్చింది. వీరిని స్వాగతించేందుకు వేలాది మంది తరలివచ్చారు. అయితే ఇంతకంటే ఎక్కువ మంది రేపు పరేడ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

Similar News

News December 16, 2025

వంటింటి చిట్కాలు మీకోసం

image

* కూరల్లో పెరుగు వేసేటప్పుడు నేరుగా కలపకుండా, ఒక కప్పులో వేసి స్పూన్‌తో చిలికి వెయ్యాలి. అప్పుడే గ్రేవీ మొత్తానికి చిక్కదనం వస్తుంది.
* పాలు మాడకుండా ఉండాలంటే కాచే ముందు గిన్నెలో కొద్దిగా చన్నీరు పోసి వంపేయాలి.
* అల్లం, వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండాలంటే దాంట్లో కొద్దిగా ఉప్పు, కాస్త వేడి నూనె వేయాలి.
* గుడ్లు ఉడికించేటప్పుడు కాస్త నూనె వేస్తే పగలకుండా ఉంటాయి.

News December 16, 2025

IPL Auction: వీరు అన్‌సోల్డ్

image

ఐపీఎల్-2026 వేలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 మంది ప్లేయర్లు అన్‌సోల్డ్‌గా మిగిలారు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన విదేశీ ఆటగాళ్లు డెవోన్ కాన్వే, రచిన్ రవీంద్ర, అట్కిన్సన్, లివింగ్‌స్టన్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌, వియాన్ ముల్డర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. దేశీ ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా(రూ.75 లక్షలు)ను కూడా పట్టించుకోలేదు.

News December 16, 2025

CTETకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే లాస్ట్ డేట్

image

CTETకు అప్లై చేయడానికి ఎల్లుండి వరకే అవకాశం ఉంది. B.Ed, D.Ed, B.EI.Ed, D.EI.Ed అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్‌, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET తప్పనిసరి. FEB 8న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200. SC/ST/ PWBDలకు రూ.500, రెండు పేపర్లకు రూ.600. వెబ్‌సైట్: ctet.nic.in/