News February 18, 2025

రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

image

AP: వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ‘ఇవాళ రాత్రి 7 గంటలకు గన్నవరం కేసుకు సంబంధించిన నిజాన్ని బయటపెట్టబోతున్నాం. అతి పెద్ద రహస్యం బయటపడనుంది’ అని పేర్కొంది. గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్‌ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే.

Similar News

News July 8, 2025

ఆ రికార్డు ఇప్పటికీ గంగూలీ పేరు మీదే..

image

సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ రూపురేఖలు మార్చారు. టీమ్ ఇండియాకు తన ‘దాదా’గిరితో దూకుడు నేర్పించారు. సెహ్వాగ్, యువరాజ్, ధోనీ వంటి ప్లేయర్లు గంగూలీ హయాంలోనే ఎంట్రీ ఇచ్చారు. అంతర్జాతీయ కెరీర్‌లో 424 మ్యాచులు ఆడిన దాదా 18,575 పరుగులు చేశారు. వీటిలో 38 సెంచరీలు ఉన్నాయి. 1997లో వన్డేల్లో వరుసగా నాలుగు POTM అవార్డులు అందుకోగా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
ఇవాళ గంగూలీ పుట్టినరోజు.

News July 8, 2025

ప్రెస్ క్లబ్‌కు ఎవరొచ్చినా చర్చకు సిద్ధం: కేటీఆర్

image

TG: తమ నేతలు మాట్లాడే సమయంలో అసెంబ్లీ‌లో మైక్ కట్ చేయకుండా చర్చకు అనుమతిస్తే సమావేశాలకు వస్తామని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అన్నారు. ‘రైతు శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రమ్మని చెబితే సీఎం ఢిల్లీ వెళ్లారు. ఆయన బదులు మంత్రులు ఎవరైనా వస్తారని భావిస్తున్నా. ఎవరొచ్చినా చర్చకు సిద్ధం. అక్కడే ఎదురుచూస్తాం. సీఎం ఇంకో రోజు టైమ్ ఇచ్చినా చర్చకు వస్తాం’ అని తెలిపారు.

News July 8, 2025

చెల్లెలు లాంటి నాపై ప్రసన్న నీచపు వ్యాఖ్యలు: ప్రశాంతి

image

AP: వరుసకు చెల్లెలు అయ్యే తనపై YCP నేత నల్లపురెడ్డి <<16985283>>ప్రసన్న<<>> కుమార్ రెడ్డి నీచపు వ్యాఖ్యలు చేస్తున్నారని TDP MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. తనపై దారుణ వ్యాఖ్యలు చేస్తున్న ప్రసన్నను కోర్టుకు ఈడుస్తానని ఆమె హెచ్చరించారు. ‘ప్రతీసారి VPRకు డబ్బు ఉందని మాజీ మంత్రి అనిల్ అంటున్నారు. ఆయనకు లేవా డబ్బులు? ఏమైనా అడుక్కు తింటున్నారా? అనిల్‌కు కూడా జైలు శిక్ష తప్పదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.