News August 14, 2024
మహువా మొయిత్రాపై విమర్శలు
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఎక్స్‌లో ప్రశ్నించిన జర్నలిస్టును TMC ఎంపీ మహువా మొయిత్రా బ్లాక్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడే మహువా బెంగాల్‌లో జరిగిన ఘటనపై ప్రశ్నించినందుకు తనను బ్లాక్ చేయడంపై జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్క ప్రశ్నను కూడా హ్యాండిల్ చేయలేరా? అంటూ నిలదీశారు.
Similar News
News September 15, 2024
నెలాఖరులోగా ‘నామినేటెడ్’ భర్తీ!
AP: భారీ వర్షాలు, వరదలతో వాయిదా పడిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. ఇప్పటికే 80% పోస్టులపై కసరత్తు పూర్తవగా, మిగతా వాటిపై కూటమి నేతలు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. TDP, JSP, BJPలకు 60:30:10 రేషియోలో పంపకాలు ఉంటాయని సమాచారం. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తవుతుందని, గత ప్రభుత్వంపై పోరాటం, కూటమి గెలుపు కోసం కీలకంగా పనిచేసినవారికే ప్రాధాన్యత ఉంటుందని కూటమి వర్గాలు తెలిపాయి.
News September 15, 2024
19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్?
AP: ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్‌లో కొత్త మద్యం పాలసీపై చర్చించి 19న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. OCT 1 నుంచి పాలసీని అమలు చేయాలని యోచిస్తోంది. ఆన్‌లైన్ లాటరీ ద్వారా షాపుల లైసెన్సులు జారీ చేయనుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ పరిధిలో షాపులు ఉండగా, ఇకపై ప్రైవేటు వ్యక్తులకే అప్పగించే అవకాశం ఉంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని CM, మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.
News September 15, 2024
IPLలో కలిసి ఆడి టెస్టులో స్లెడ్జింగ్.. షాకయ్యా: ధ్రువ్ జురెల్
IPLలో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో కలిసి ఆడిన జో రూట్ టెస్టు మ్యాచ్‌లో స్లెడ్జింగ్ చేయడంతో షాకయ్యానని ధ్రువ్ జురెల్ చెప్పారు. ఈ ఏడాది రాజ్‌కోట్ వేదికగా ENGతో జరిగిన టెస్టులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అతను గుర్తు చేసుకున్నారు. ‘రూట్ అదేపనిగా నన్ను స్లెడ్జింగ్ చేశారు. అతని మాటలు నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే మనం ఇప్పుడు దేశం కోసం ఆడుతున్నామని అతను చెప్పారు’ అని పేర్కొన్నారు.