News January 9, 2025
ప్రియాంక, ఆతిశీపై కామెంట్స్.. రమేశ్ బిధూరీ ఎమ్మెల్యే సీటుకు ఎసరు!

కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ, ఢిల్లీ CM ఆతిశీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP నేత రమేశ్ బిధూరీపై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆయనను తప్పించి, మహిళా అభ్యర్థిని నిలపాలని చూస్తున్నట్లు సమాచారం. కాగా CM ఆతిశీ తన తండ్రినే మార్చేశారని, తాను MLAగా గెలిస్తే నియోజకవర్గ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా మారుస్తానని రమేశ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Similar News
News December 19, 2025
ఆసియా యూత్ పారా గేమ్స్‌లో సత్తా చాటిన హైదరాబాద్ బాలిక

ఆసియా యూత్ పారా గేమ్స్‌లో తెలుగు ప్లేయర్ గంగపట్నం విజయ దీపిక టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణం, కాంస్యం గెలిచింది. హైదరాబాద్‌కు చెందిన దీపిక టీటీ మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, మహిళల సింగిల్స్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. 15 ఏళ్ల దీపిక కాంటినెంటల్ స్థాయిలో స్వర్ణం గెలిచిన పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది. దీపిక తల్లి అరుణ వెటరన్ టెన్నిస్ ప్లేయర్. సోదరుడు విజయ్ తేజ్ జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్.
News December 19, 2025
24,000 మంది పాక్ బిచ్చగాళ్లను వెనక్కి పంపిన సౌదీ

వ్యవస్థీకృత భిక్షాటనకు పాల్పడుతున్న పాకిస్థానీలపై గల్ఫ్ దేశాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. భిక్షాటన చేస్తున్న దాదాపు 24,000 మందిని 2025లో సౌదీ వెనక్కి పంపగా.. దుబాయ్ 6,000, అజర్‌బైజాన్ 2,500 మందిని బహిష్కరించాయి. మరోవైపు పెరుగుతున్న నేరాల కారణంగా పాకిస్థానీలపై UAE వీసా ఆంక్షలు విధించింది. అక్రమ వలసలు, భిక్షాటన ముఠాలను అరికట్టేందుకు పాక్ FIA స్వదేశీ విమానాశ్రయాల్లో 66,154 మందిని అడ్డుకుంది.
News December 19, 2025
ఏది నీతి.. ఏది నేతి.. ఓ మహాత్మా.. ఓ మహర్షి!

తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఆరోపణలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. తమ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంటే, స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారని BRS ఆరోపిస్తోంది. అయితే గురవింద గింజ నీతులతో మీ కింద నలుపు మర్చిపోవద్దని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. BRS హయాంలో ఇలాగే చేర్చుకోలేదా? మంత్రి పదవులు ఇవ్వలేదా? అనేది హస్తం నేతల ప్రశ్న. ఇక్కడ తప్పు పార్టీలదా? తెలిసీ ఇలాంటి వారిని ఎన్నుకునే ప్రజలదా?


