News October 2, 2024
సమంతపై వ్యాఖ్యలు జుగుప్సాకరం: రోజా
AP: నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై, సమంతపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని వైసీపీ నేత రోజా అన్నారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘కొండా సురేఖపై బీఆర్ఎస్ నేతల పోస్టులను అందరూ వ్యతిరేకించారు. కానీ తోటి మహిళపై హేయమైన వ్యాఖ్యలు చేయడానికి సురేఖకు మనసు ఎలా వచ్చింది? మీ రాజకీయ వివాదాల్లోకి మహిళను తీసుకురావడం దుర్మార్గం’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News October 15, 2024
EVMల బ్యాటరీ కాలిక్యులేటర్ బ్యాటరీ లాంటిది: CEC
EVMల బ్యాటరీ కాలిక్యులేటర్ల బ్యాటరీ లాంటిదని CEC రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా పేజర్లను ఇజ్రాయెల్ పేల్చగలిగినప్పుడు, మన EVMల పరిస్థితేంటని కాంగ్రెస్ ప్రశ్నించడంపై ఆయన స్పందించారు. ఈవీఎంలలో కాలిక్యులేటర్ లాంటి సింగిల్ యూజ్ బ్యాటరీ ఉంటుందని, అది మొబైల్ బ్యాటరీ కాదని పేర్కొన్నారు. ఈవీఎంల బ్యాటరీలకు మూడంచెల రక్షణ వ్యవస్థ ఉంటుందని వివరించారు.
News October 15, 2024
మద్యంలో జగన్ రూ.40వేల కోట్ల దోపిడీ: అచ్చెన్నాయుడు
AP: రాష్ట్రంలోని వ్యవస్థలను YS జగన్ నాశనం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. మద్యంలో రూ.40వేల కోట్లు దోచుకున్నారని, ఇసుకలోనూ ఇలాగే కొల్లగొట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో నూతన లిక్కర్ పాలసీ వల్ల దరఖాస్తుల ద్వారానే రూ.1,800కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రేపు ఇసుక రీచ్‌లు మొదలవుతాయని, పది రోజుల్లో సమస్య తీరుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
News October 15, 2024
పార్టీ గుర్తు విషయంలో ఈసీదే అంతిమ నిర్ణయం: శరద్ పవార్
పార్టీ గుర్తుపై ఎన్నికల కమిషన్‌దే తుది నిర్ణయమని ఎన్సీపీ-పవార్ వర్గం చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఈ విషయంలో ఈసీ ఆదేశాలను తాము స్వీకరించాల్సిందేనని చెప్పారు. గత ఏడాది పార్టీ రెండుగా విడిపోవడంతో మెజారిటీ ఆధారంగా అజిత్ వర్గానికి గడియారం గుర్తును ఈసీ కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా శరద్ వర్గానికి ‘బాకా ఊదుతున్న వ్యక్తి’ గుర్తును కేటాయించింది.