News April 1, 2025

కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు

image

19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు 41 రూపాయలు తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ రేట్ రూ.1,762కు చేరింది. హైదరాబాద్‌లో 1,985గా ఉంది. ప్రతినెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తాయి. అందులో భాగంగానే రేట్స్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

Similar News

News April 2, 2025

STOCK MARKET: రాణించిన సూచీలు

image

మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ట్రంప్ సుంకాల భయాలున్నా వాటి ప్రభావం స్టాక్స్‌పై పెద్దగా కనిపించలేదు. సెన్సెక్స్ 600 పాయింట్ల మేర లాభపడి 76,146 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 23,300 వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ, జొమాటో, ఇండస్ ఇండ్, టైటాన్ షేర్లు రాణించాయి. కాగా.. ఈరోజు రాత్రి 1.30 గంటలకు సుంకాలపై ట్రంప్ నిర్ణయం వెలువడనుంది.

News April 2, 2025

ఆ సినిమా చేయొద్దు.. సల్మాన్‌కు ఫ్యాన్స్ రిక్వెస్ట్

image

‘సికందర్’తో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన సల్మాన్ ఖాన్ తన తదుపరి సినిమాను క్రిష్ అహిర్ అనే కొత్త డైరెక్టర్‌తో చేయనున్నట్లు సమాచారం. సంజయ్ దత్ కూడా ఇందులో నటిస్తారని, ‘గంగా రామ్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ సినిమా చేయవద్దని పలువురు అభిమానులు సల్మాన్‌ను కోరుతున్నారు. ఆ టైటిల్ బాగోలేదని అంటున్నారు. తమకు ఇంకా బెటర్ సినిమాలు కావాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

News April 2, 2025

నిందితుడిని కఠినంగా శిక్షించాలి: అనిత

image

AP: విశాఖలో ప్రేమోన్మాది దాడి <<15968879>>ఘటనపై <<>>హోంమంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన అనిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. యువతి తల్లి లక్ష్మి మృతిపై హోంమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

error: Content is protected !!