News June 15, 2024

రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్: కేసీఆర్

image

TG: జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. ‘బీఆర్ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాం. కరెంట్ విషయంలో గణనీయమైన మార్పు చూపించాం. కానీ రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు. కమిషన్ ఛైర్మన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు నన్ను బాధించాయి.’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Similar News

News January 5, 2026

నల్లమలసాగర్ ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంలో విచారణ

image

TG: ఏపీ ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించనుంది. అనుమతుల్లేకుండా చేపడుతున్న ఈ పనులపై బలమైన వాదనలు వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సీఎం రేవంత్ సూచించారు. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావును విచారించేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైనా నేడు విచారణ జరగనుంది.

News January 5, 2026

ESIC నవీ ముంబైలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>ESIC <<>>నవీ ముంబైలో 7 సర్జన్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంబీబీఎస్, పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 69ఏళ్లు. జనవరి 6న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సర్జన్‌కు నెలకు రూ.1,0,0,600, మెడికల్ ఆఫీసర్‌కు రూ.85వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News January 5, 2026

సెంచరీలు బాదడంలో ఇతని ‘రూటే’ సపరేటు!

image

ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ టెస్టుల్లో నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నారు. 2021 నుంచి అతను ఏకంగా 24 శతకాలు కొట్టడమే దీనికి నిదర్శనం. రూట్ తర్వాత ప్లేస్‌లో నలుగురు ప్లేయర్లు ఉండగా, వారిలో ఒక్కొక్కరు చేసిన సెంచరీలు 10 మాత్రమే. ఈ ఫార్మాట్ ఆడుతున్న యాక్టివ్ ప్లేయర్లలో సచిన్ టెస్ట్ సెంచరీల(51) రికార్డును బద్దలు కొట్టే సత్తా ప్రస్తుతం రూట్‌కే ఉంది. తాజాగా యాషెస్‌లో ఆయన 41వ సెంచరీ సాధించారు.